నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరో. నాని తో సినిమా తీసిన నిర్మాత సేఫ్ గా ఉంటాడన్న నమ్మకం. అయితే గత కొంతకాలంగా నాని సినిమాలన్ని అంతగా సక్సస్ కావడం లేదు. యావరేజ్ అన్న టాక్ దగ్గరే నాని సినిమా ఆగిపోతుంది తప్ప సూపర్ హిట్ అన్న మాట రావడం లేదు. ప్రస్తుతం నాని.. దిల్ రాజు నిర్మాణంలో వి సినిమాని కంప్లీట్ చేశాడు.
ఇందగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ చిత్రం షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో పల్లె వాతావరణంలో చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో అనుకుంటూ ఉండగా కరోనా లాక్ డౌన్ మొదలైంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టేది క్లారిటీ లేదు.
షూటింగ్స్ కు అనుమతులు వచ్చినప్పటికి చిత్రీకరణ మొదలు పెట్టాలంటే మేకర్స్ ధైర్యం చేయలేకపోతున్నారు. అందుకే లాక్ డౌన్ విరమించినప్పటి నుంచి నాని సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అయినంత వరకు డబ్బింగ్.. రి రికార్డింగ్.. ఎడిటింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని సమాచారం. ఇక పరిస్థితులు చక్కబడితే మళ్ళీ ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రీతూ వర్మ.. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!