ఈ తరం హీరోల్లో కచ్చితంగా బ్యాంకబుల్ స్టార్ అంటే నాని అనే చెప్పాలి. నాని నుండి సినిమా వస్తోందంటే అది కచ్చితంగా మినిమమ్ గ్యారంటీ అన్న భావన ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అయితే నాని ఫామ్ ప్రస్తుతం ఏమంత బాగోలేదు.
తనకు నటుడిగా బాగా పేరు తెచ్చిన జెర్సీ యావరేజ్ విజయంగా నిలిచిపోయింది. క్రితం ఏడాదే వచ్చిన గ్యాంగ్ లీడర్ భారీ అంచనాలను అందుకోలేక చతికిల పడింది. ఈ ఏడాది నాని 25వ చిత్రం విడుదలైంది. నాని తన కెరీర్ లో తొలిసారి పూర్తి స్థాయి నెగటివ్ పాత్రలో కనిపించిన చిత్రం వి. తన తొలి చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది.
అయితే మరి కొన్ని రోజుల్లో విడుదల అనగా కరోనా వైరస్ కారణంగా అది నిలిచిపోయింది. అది జరిగి దాదాపు ఏడు నెలలు పూర్తయినా ఇంకా థియేటర్ల విషయంలో ఎటువంటి క్లారిటీ రాలేదు. దీంతో వి చిత్ర నిర్మాత దిల్ రాజు దీన్ని అమెజాన్ ప్రైమ్ కు అమ్మేశాడు. అయితే వి చిత్రానికి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాని నటన పరంగా అదరగొట్టినా దర్శకత్వంలో విఫలమవడంతో వి ప్రేక్షకులకు రుచించలేదు. ఇక నాని తన తర్వాతి సినిమాపై ఫోకస్ పెట్టాడు.
నాని శివ నిర్వాణతో కలిసి టక్ జగదీష్ లో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుండి మొదలైంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!