Nayanatara : సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే ఇటీవల ఓటీటీ కోసం సినిమాలు చేస్తోంది. సినిమాలకైనా, డిజిటల్ ప్లాట్‌ఫాంస్ కోసం రూపొందే సినిమాలకైనా, వెబ్ సిరీస్ కోసమైనా నయనతార రెమ్యూనరేషన్ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. అయినా ఆమె కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సౌత్‌లో నయన్ క్రేజ్ అలాంటిది. అందుకే ఇప్పుడు ఆహా కూడా తను నటించిన సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతోంది. ఈ మధ్యకాలంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా అమెజాన్, జీ 5, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీలకి గట్టిపోటీ ఇస్తోంది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలతో పాటు ఇతర భాషలలో స్టార్ నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నయనతార సినిమాను రిలీజ్ చేయనున్న రిలీజ్ డేట్ ను అధికారకంగా ప్రకటించారు. నీడ పేరుతో తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల అవుతోంది. ఈ సినిమా మలయాళంలో హిట్ సాధించిన ‘నిళల్’ అనే మిస్టరీ థ్రిల్లర్ కి రీమేక్ గా రెడీ అవుతోంది. నయనతారతో పాటు కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.
Nayanatara : నయనతార అంధురాలిగా కనిపించబోతోంది.
కాగా జూలై 23న ఈ మూవీని స్ట్రీమింగ్ కి సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ కూడా వదిలింది ఆహా బృందం. ఎన్. భట్టాత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. మరి సినిమా మన తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక నయనతార ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తేలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే త్వరలో ఆమె ప్రధాన పాత్రలో నటించీ నెట్రికన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో నయనతార అంధురాలిగా కనిపించబోతోంది.