NewsOrbit
న్యూస్

ఏపీలో కొత్త పొలిటికల్ సీన్..! ఉండవల్లికి బీజేపీ నుండి ఊహించని రియాక్షన్..!!

ఏపీలో రాజకీయ కాక మొదలైంది. నిన్నటికి నిన్న సత్యప్రమాణాల అనపర్తిలో మొదలైన చిచ్చు ఇప్పుడు తిరుపతికి చేరింది. బీజేపీ ఆకర్ష్ మొదలెట్టడంతో ఆ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. దీంతో ఆపార్టీపై రాజకీయ మాటల తూటాలను సంధించారు కాంగ్రెస్ మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

బీజేపీలో చేరే వారికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచనలు చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అన్ని పార్టీల లాంటిది కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. సోషలిస్టులకు బీజేపీ చాలా వ్యతిరేకమని కామెంట్స్ చేశారు. బీజేపీలో చేరాలనుకునే వాళ్లు వాస్తవం తెలుసుకోవాలని సూచించారు. పదవులు కోసం పార్టీలో చేరకూడదని, మాజీ ప్రధాని వాజ్‌పాయి, అద్వానీ వంటి నేతలకు ఆర్ఎస్ఎస్ ఎలా చెక్ పెట్టిందో తెలుసుకోవాలంటూ కామెంట్ చేశారు.

ఉండవల్లి పిండేసిన బిజెపి విష్ణు!

ఉండవల్లి మాటలపై ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ ‌రెడ్డి. ఉండవల్లి గారు .. మీరు ఊసరవల్లిగా మారవద్దు! బిజేపీలో ఎందుకు చేరాలి? ఎందుకు చేరకూడదు? చేరే వాళ్లకు తెలుసు అంటూ మండిపడ్డారు. రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన మీలాంటి వారి సలహాలు వారు ఎందుకు తీసుకుంటారు అంటూ సెటైర్ వేశారు. మీ భ్రమ తప్ప… మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు? ఏ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బతికించాలి? అని తాపత్రయ పడుతున్నారో.. దాని వెనుక ఉన్న రహస్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

ఓ మేధావి!నీకు ఆరెస్సెస్ చరిత్ర తెలియదా?

ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా విమర్శలు చేశారు. మీరు నమ్మి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ మీ మాజీ ప్రధాని నెహ్రూ గారు 1963 జనవరి 26 న ఆర్ఎస్ఎస్ ను స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ లో ఆహ్వానించారు. ఆర్ఎస్ఎస్ గురించి నేడు మీరు చరిత్రను వక్రీకరించి హేళనగా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నేడు అత్యున్నతమైన రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధాని లాంటి పదవులలో దేశం కోసం పనిచేస్తున్నారు ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలని సూచిచారు. మేధావులు కదా ఈ చరిత్ర తెలియదా? తెలియకపోవచ్చులే. మనం మేధావి ముసుగులో ఉన్నాం కదా! అంటూ విమర్శిస్తూనే చురకలంటించారు విష్ణు వర్ధన్ రెడ్డి.ఈ మధ్యకాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ దాదాపు అన్ని పార్టీలను కెలుకుతున్నారు.అయితే ఆ పార్టీలేవీ పెద్దగా రియాక్ట్ కాలేదు.కానీ బీజేపీ మాత్రం ఉండవల్లికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.ఉండవల్లి కూడా ఊరుకునే రకం కాదు కాబట్టి మళ్లీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N