money: ఎంత సంపాదించిన చాలా మంది చేతిలో డబ్బు అస్సలు నిలువదు. వచ్చిన వెంటనే ఖర్చయిపోతుంది. ఏమి చేసిన కొంచెం కూడా పొదుపు చేయలేకపోతుంటారు. అనుకోని ఖర్చులు వచ్చి పడిపోతుంటాయి. దీనికి వాస్తు కూడా ఒక కారణం అయిఉండొచ్చు. వాస్తుకు, డబ్బుకు లింకేంటి అని ఆలోచించకండి. ఎందుకంటే ఈ రెండింటికీ కనెక్షన్ ఉంది అని వాస్తు నిపుణులు తెలిసిచ్చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే , మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది అని సూచిస్తున్నారు .
వాస్తు లో తెలియచేసిన దాని ప్రకారం.. ఇంట్లో ఉన్న శక్తులు.. మీ డబ్బు పై తమ ప్రభావం పడేలా చేస్తుంటాయి. అందుకే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ నిర్లక్షయం గా పడేయకూడదు.అయితే డబ్బు ఎక్కడ దాచుకోవాలి? ఏ డబ్బు పెట్టుకునే లాకర్ ఏ దిశలో ఉంటే మంచిది? డబ్బు దాచడం లో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది.. ఇలాంటి విషయాలు గురించి తెలుసుకుందాం. వాస్తు పండితులు డబ్బు, కార్డు లు ధనానికి సంబంధించిన వస్తువులు అన్ని ఇంట్లో ఉత్తర దిక్కులో భద్రపరచుకోవడం మంచిది. ఉత్తర దిక్కు కుబేరుడు ఉండే స్థానం అని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కుబేరుడు ధనానికి అధిపతి. అందుకే ఇంట్లో ఉత్తర దిక్కు లో ఓ బాక్స్ లేదా బ్యాగు ఏర్పాటు చేసుకుని అందులో డబ్బులు, కార్డులు దాచుకోవడం మంచిది.ఇలా ఉత్తర దిక్కులో ఉండటం వలన సంపద వృద్ధి చెందుతుంది.అలాగే వృద్ధి చెందిన ధనం ఇంట్లో నైరుతి దిశలో ఉన్న లాకర్ లో పెట్టుకోవాలి. ఈ లాకర్ లో డబ్బులునిల్వ చేసుకోవడం వల్ల మీ ధనం స్థిరత్వాన్ని పొందుతుంది అని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. దింతో పాటు మీ లాకర్ తలుపు ఎప్పుడు కూడా పడమర దిశ వైపు ఓపెన్ కాకూడదు .
ఆ దిక్కున తెరుచుకోవడం వల్ల మీ ధనం బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందట. డబ్బును ఇంట్లో ఏదో మూల పెట్టడం అస్సలు మంచి పని కాదు అంటుంది వాస్తు శాస్త్రం. ఒకవేళ ఏదో మూలకు పెట్టక తప్పదు అని అనుకునేలా అయితే .. ఉత్తర, తూర్పు మూలల్లో డబ్బు ను పెట్టుకోవాలి. అంతే కాదు ఇంట్లో డబ్బులు దాచుకునే డబ్బా, ఎప్పుడూ ఇంటి బయట నిలబడి చుస్తే కనిపించకూడదు. గుమ్మానికి ఎదురుగా కూడా ఉండకూడదు. డబ్బులు పెట్టుకునే పెట్టెలు ఏదైనా అల్మరాలో కానీ అందరి దృష్టి లో పడిన చోట పెట్టుకోవడం మంచిది. ఎవరికైనా మీ లాకర్ కనిపించేలా ఉంటే మాత్రం.. డబ్బు మీ చేజారి పోయే అవకాశం ఉందని అర్థం. అలాగే క్యాష్ బాక్స్, లాకర్‌ను ఎప్పడూ దక్షిణ దిక్కున కూడా ఉంచకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉత్తర దిక్కున ఉండటానికి ఇష్టపడుతుంది. అందుకే దక్షిణ దిక్కున డబ్బులు పెట్టుకోవద్దు అని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు . వంటగది , బాత్రూమ్, మెట్లు స్టోర్ రూమ్‌కి దగ్గరలో లాకర్లు ఉండకపోవడం మంచిదిట. వాస్తు మీద నమ్మకం ఉంటే వాటిని పాటించి చూడండి.