NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ మంత్రికి నో టిక్కెట్‌… త్యాగ‌రాజుగా మిగిలిపోతాడే…!

వైసీపీలో కీలక మంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు మోసిన ఓ యువమంత్రికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వస్తుందా ? లేదా అన్న చర్చ‌ సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే తన పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకున్న సదరు యువ మంత్రి తన సీటు గురించి కూడా నోరు విప్పలేదు. ఇప్పటికే ఆయన సిట్టింగ్ సీటులోకి మరో ఇన్చార్జ్ వచ్చారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం రిలీజ్ చేసిన ఆరు జాబితాలో ఆ యువమంత్రికి మరో నియోజకవర్గం కూడా కేటాయించలేదు. దీంతో సదరు మంత్రి రాజకీయ భవిష్యత్తుపై ఆయన అనుచరులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.

No ticket for YCP minister.
No ticket for YCP minister.

ఆ మంత్రి ఎవరో కాదు విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్. ప్రస్తుతం అనకాపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అనకాపల్లికి జగన్ ఇప్పటికే మరో ఇన్చార్జిను నియమించారు. గుడివాడ అమర్నాథ్ నివాసం ఉంటున్న గాజువాక సీటు అయిన ఆయనకు కేటాయిస్తారు అనుకుంటే అక్కడ మరో ఇన్చార్జిను నియమించారు. దీంతో ఆయన ఆశలు పెట్టుకున్న అనకాపల్లి, గాజువాక రెండు సీట్ల లోను పార్టీ తరఫున కొత్త ఇన్చార్జిలు ఉన్నారు. అయితే అమర్నాథ్ చోడవరం నుంచి కూడా పోటీ చేస్తానని తన అనుచరులతో చెబుతున్నారు. అక్కడ సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈసారి సీటు తనకే అని తెగేసి చెప్పేశారు. జగన్ సైతం ఆయన మాట కాదనలేకపోయారు.

ఒక దశలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీగా పంపించాలనుకున్నా ఆయన ఒప్పుకోలేదు. దీంతో ఎలమంచిలి నుంచి పోటీ చేయాలని కూడా మంత్రి గుడివాడ చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు మంత్రి గుడివాడకు పెద్ద యుద్ధమే జరిగింది. ఆ సీటు విషయంలో కూడా జగన్ గుడివాడకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని తెలుస్తోంది. దీంతొ గుడివాడ‌ పెందుర్తి నుంచి పోటీ చేస్తారు అని తాజాగా వార్తలు వచ్చినా సామాజిక సమీకరణలు వెలమలకు ఛాన్స్ అన్న లెక్కలతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌నే కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు. దీంతో గుడివాడ ఆశలు దాదాపుగా ఎమ్మెల్యే సీటు విషయంలో లేవు అనే అంటున్నారు.

అయితే అనకాపల్లి ఎంపీ సీటు నుంచి గుడివాడను పోటీ చేయిస్తారు అని మరో ప్రచారం జరుగుతున్నా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కాపులకు ఇచ్చినందువల్ల… గ‌వ‌ర సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఇలా ఓవరాల్‌గా విశాఖ జిల్లాలో పరిణామాలు చూస్తుంటే గుడివాడకు ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే సీటు వచ్చే ఛాన్స్ లేనట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల మాట్లాడుతూ తన జాతకం జగన్ రాస్తారు అంటూ ఓకింత వైరాగ్యంతో కూడిన రాజకీయ వ్యాఖ్యలు చేశారు.

No ticket for YCP minister.
No ticket for YCP minister.

అందరి రాతలు దేవుడు రాస్తాడని.. తన రాత మాత్రం ముఖ్యమంత్రి జగన్ రాస్తారు అని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. యువనేతగా ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడిగా గుడివాడకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే జగన్ ఎంతో నమ్మినా ఆయనకు ఇప్పుడు సీటు విషయంలో క్లారిటీ లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో అసలు ఆయనకు సీటు ఉంటుందా ? లేదా పోటీకి దూరంగా ఉండి త్యాగరాజుగా మిగిలి పోవాల్సిందేనా అన్న చర్చిలు కూడా నడుస్తున్నాయి.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju