NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

లక్ష రూపాయల కోసం స్వంత కిడ్నప్ డ్రామా.. చివరికి?

Share

ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినప్పుడు కిడ్నాపర్ గురించి సమాచారం బయట తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి నుంచి డబ్బును లేదా ఏవైనా ఆస్తులను డిమాండ్ చేస్తూ ఉంటారు. కిడ్నాపర్స్ గురించి బయట తెలియజేస్తే కిడ్నాప్ చేసిన వ్యక్తిని చంపేస్తామంటూ బెదిరించి వారి డిమాండ్లను నెరవేర్చుకుంటారు. కానీ ముంబైలో జరిగిన ఒక వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ముంబైలో అంధేరి ప్రాంతంలో నివసించే టటువంటి జితేంద్ర కుమార్ యాదవ్ అనే వ్యక్తి కిడ్నాప్ కి గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో అతనిని కిడ్నాప్ చేసి ఒక చీకటి గదిలో కూర్చీలో కట్టేసిన వీడియోతీసి,ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్ లో నివాసముంటున్న అతని భార్యకు పంపించారు. జితేంద్ర ప్రాణాలతో బయటకు రావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్స్ డిమాండ్ చేశారు.

జితేంద్ర భార్య, బావమరిది కిడ్నాపర్ల బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ చేసిన తర్వాత తన భర్త జితేందర్ ను కిడ్నాపర్లు సురక్షితంగా బయటకు వదిలారు. అయితే జితేందర్ బావమరిది సుశికుమార్ ఓషివారా కిడ్నాప్ విషయం ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గురువారం ఉదయం ఓషివారాలోని తారాపోరేవాలా గార్డెన్ లో ఆగి ఉన్న ఒక కారులో జితేందర్ ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కిడ్నాపర్ల గురించి జితేంద్రను ఆరా తీయగా, పోలీసులకి దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. జితేందర్ కుమార్ తన సొంత అవసరాలకోసం కొంత డబ్బు అవసరమయ్యింది.

ఆ డబ్బు కోసమే తన స్నేహితుడు ఇంద్ర కుమార్ యాదవ్ తో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడినట్టు పోలీసులకు తెలియజేశాడు. డ్రామా లోని భాగంగా కుర్చీలో కట్టేసి వీడియో తీసి వీరే తన భార్యకు పంపినట్లు ఒప్పుకోవడంతో జితేంద్ర తన స్నేహితుడు ఇంద్ర కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 364 ఏ, సెక్షన్ 387,385 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Share

Related posts

అన్నదాత సుఖీభవ

somaraju sharma

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో కేంద్రం సడలింపులు దేనికి సంకేతం ?

Siva Prasad

Drama Juniors : డ్రామా జూనియర్స్ ఫన్నీ ప్రోమో అదుర్స్?

Varun G