టాలీవుడ్ కింగ్ .. మన్మధుడు నాగార్జున ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు సీజన్స్ కంటే ఈ సీజన్ ని ఇంకా పెద్ద సక్సస్ చేయాలనుకున్న నిర్వాహకులకి షాక్ తగిలింది. ఇప్పటివరకు గడిచిన మూడు సీజన్స్ తో పోల్చుకుంటే ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న 4 సీజన్ కి రేటింగ్ అంతగా రావడం లేదన్న టాక్ వస్తుంది.
కేవలం నాగార్జున కనిపిస్తున్న వీకెండ్ ఎపిసోడ్స్ తప్ప మిగిలిన రోజులు షో అతి దారుణంగా సాగుతుందని అంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకుల మీద చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఓట్ల ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదన్నది కూడా బాగా ప్రచారం అవుతోంది. అదీకాకా ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళతో పెద్ద ఉపయోగం లేదన్న మాటా చెప్పుకుంటున్నారు.
ఇలాంటి క్రమంలో నిర్వాహకులకి ఈ సీజన్ నడపడం కత్తి మీద సాములా తయారైంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ్ ముందు ఇచ్చిన డేట్స్ ప్రకారం ఆయన నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్ చిత్రీకరణ కోసం దాదాపు 20 రోజులకి పైగానే హిమాలయాస్ వెళ్ళారు. దాంతో ఇప్పుడు షో పరిస్థితి ఏంటన్నది ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే నాగ్ మాదిరిగానే డబుల్ ఎనర్జీతో షో ని లాక్కొచ్చేందుకు అక్కినేని సమంత వీకెండ్స్ లో వచ్చి సందడి చేయనుంది. మొత్తానికి నాగ్ ప్లేస్ లో సమంత వచ్చి ఎంటర్టైన్ చేయబోతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!