NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Pakistan PM Imran Khan: విశ్వాస పరీక్షకు ముందే ఇమ్రాన్ రాజీనామా..?

Pakistan PM Imran Khan: పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆదేశాలతో జాతీయ పార్లమెంట్ పునరుద్దరణ జరిగింది. నేడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్నది. ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నాటి నుండి పాక్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటి స్పీకర్ తిరస్కరించడం, ఆ వెంటనే వ్యూహాత్మకంగా ఇమ్రాన్ ఖాన్ జాతీయ పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అధ్యక్షుడికి సిఫార్సు చేయడం, ప్రధాని సిఫార్సును అధ్యక్షుడు ఆమోదించడం జరిగిపోయాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు పాకిస్థాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, డిప్యూటి స్పీకర్ చర్యను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. రాజ్యాంగ విరుద్దంగా జాతీయ పార్లమెంట్ ను రద్దు చేసినట్లు పేర్కొన్న సుప్రీం ధర్మాసనం జాతీయ పార్లమెంట్ ను పునరుద్దరిస్తున్నట్లు పేర్కొని అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ ఉదయం 10.30 గంటలకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సమావేశం కానున్నది.

Pakistan PM Imran Khan likely resigns before no confidence vote
Pakistan PM Imran Khan likely resigns before no confidence vote

Pakistan PM Imran Khan: ఓటింగ్ జరిగి పదవి కోల్పోతే..

శుక్రవారం విడుదల చేసిన ఆరు పాయింట్ల అజెండా మేరకు నాల్గవ అంశంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. 342 స్థానాలు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో మెజార్టీకి 172 ఓట్లు అవసరం కాగా, మిత్ర పక్షాలు దూరం కావడంతో పాటు సొంత పార్టీ చెందిన సభ్యులు వ్యతిరేకంగా మారడంతో ఇమ్రాన్ సర్కార్ మైనార్టీలో పడింది. ఓటింగ్ జరిగి పదవి కోల్పోతే విశ్వాస పరీక్ష ద్వారా పదవి కోల్పోయిన తొలి ప్రధాని అవుతారు ఇమ్రాన్ ఖాన్. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షకు ముందే ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ తన ఓటమిని పరోక్షంగా అంగీకరించారు.

Pakistan PM Imran Khan: కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు ప్రతిపక్షాలు సన్నాహాలు

శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే సమయంలో శాంతియుత నిరసనలు తెలియజేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఇదే సందర్భంగా భారత్ సార్వభౌమాధికారాన్ని ప్రసంశించారు. భారత్ ను ప్రపంచంలోని ఏ దేశం శాసించలేదని పేర్కొన్నారు. మరో పక్క విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఓటమి ఖాయం కావడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకున్నారు. విపక్షాలు బలపరుస్తున్న పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?