PC Mustafa : ఆ ఇడ్లీ పిండి కంపెనీ వెనుక ఇంతా కధ ఉందా …?

Share

PC Mustafa : మనం టిఫిన్ లో ఎక్కువ వినే పేరు ఇడ్లి. ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోయిన, ఆయిల్ ఫుడ్ వద్దు అన్నా ఫస్ట్ టిఫిన్ గుర్తొచ్చేది ‘ఇడ్లీ’. అయితే ఈ ఇడ్లీ పిండి వల్లే ఒకరి జీవితం పూర్తిగా మారిపోయింది. దీని కోసం ఉన్న జాబ్ ని సైతం వదులుకున్నాడు. జాబ్ వదులుకున్న రోజు నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. అలా ఎనిమిదేళ్లు అతడు పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం దక్కింది. ఇంతకీ ఎవరు, ఈ కథేంటి అనుకుంటున్నారా.. కష్టం ఊరికేపోదని అతని జర్నీ చూస్తే మీకే అర్థం అవుతుంది.


WOMEN: రోడ్డుపై మహిళల వినూత్న నిరసన .. ఎక్కడంటే …?

ముస్తఫా.. కేరళకు చెందిన ఒక పేద కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటినుంచే కష్టపడేవాడు. రోజు కష్టపడితే కానీ కడుపునిండేది కాదు. చదువుకి కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. అయితే అతని కష్టాన్ని చూసిన టీచర్ ముస్తఫాకి సహాయం చేసింది. దీంతో ఆటను మళ్ళీ చదువుబాట పట్టాడు.బాగా చదివి స్కూల్ టాపర్ గా నిలిచి మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు. తండ్రి చేసిన అప్పులను కూడా తీర్చేసాడు. ఫారిన్ లో జాబ్ చేసే అవకాశం రావడంతో ముస్తఫా వెళ్ళిపోయాడు. అయితే అతనికి ఇంకా ఏదో తెలియని వెలితి ఉండేది. ఇన్ని సాధించిన ఇంకో ఎదో మిగిలిపోయింది అనుకున్నారు. ఉద్యోగం తనకు సంతోషాన్ని ఇచ్చేది కాదని వ్యాపారం చేయాలనీ నిర్ణయించుకున్నారు.


surgeon: దేవుడా.. కేవలం 7 గంటల్లో 101 మంది మహిళలకు సర్జరీ..?!

ఇలాంటి సమయంలోనే ముస్తఫా బంధువులు ఒక ఐడియా తీసుకొచ్చారు. ఇడ్లీ – దోశ పిండి కంపనీని ప్రారంభించాలనే ఆలోచనను ముస్తఫాకి చెప్పారు. అతనికి రూ.50000 పెట్టుబడి సాయం కింద ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేసి ఈ ఐడియా మొత్తం నువ్వే చూసుకో అని చెప్పాడు. ముస్తఫా సరే అని బాగా అలోచించి ఈ ఐడియా వర్క్ అయితే మంచి లాభాలు వస్తాయి.. భారీ మార్కెట్ కూడా ఉంటుందని గుర్తించాడు. వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసాడు. అయితే ఇక్కడే ముస్తఫాకి బ్రేక్ పడింది. పూర్తి సమయాన్ని దీనికే కేటాయించిన వ్యాపారం అనుకున్నంత లాభం రాలేకపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చింది.

Moringa: ఆరోగ్యానికి పర్మినెంట్ అడ్రస్ ఈ ఆకు..!! 
అయితే అప్పటినుంచి మరింత సమయాన్ని కేటాయించడం మొదలుపెట్టాడు. ఎవరు నష్టపోరని అందరికి వివరించి అందరికి ఇందులో మంచి భవిష్యత్తు ఉంటుందని, కంపెనీ షేర్లు ఇస్తానని చెప్పి మళ్ళీ కష్టపడడం మొదలుపెట్టాడు. అలా ఎనిమిదేళ్లు కష్టపడిన ముస్తఫాకి ఇప్పుడు విజయం వరించింది. ఒక పెద్ద ఇన్వెస్టర్ దొరకటం.. రూ.2000 కోట్లు ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టటంతో కంపెనీ సీన్ మారిపోయింది. ఒకప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని ముస్తఫా ఇప్పుడు చాలా మందికి మంచి ఉద్యోగాలు ఇచ్చే పోజిషన్ లో ఉన్నారు. కష్టం ఉందని వెనుక అడుగు వేస్తే అది ఓటమి అవుతుంది. కష్టం ఉన్నా సరే నిజాయితీగా ముందుకెళ్తే చివర్లో విజయం సాధించవచ్చని ముస్తఫా జీవితం మళ్ళీ రుజువు చేసింది.

BREAKING BB5 : అదిరిన `బిగ్‌బాస్ 5` ప్రోమో..ట‌న్నుల కొద్ది కిక్ అంటున్న నాగార్జున.. !


Share

Related posts

Katti Mahesh: బ్రేకింగ్..లారీని ఢీకొన్న సినీ నటుడు కత్తి మహేష్ కారు..నెల్లూరు జిల్లాలో ఘటన..

somaraju sharma

విహంగాలతో ..! కొల్లేరు సరసు..! మరింత రమణీయం..!

bharani jella

కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ తో రికార్డ్స్ అన్ని బద్దలు .. ఇక పదేళ్ళపాటు ప్రశాంత్ నీల్ గురించే మాట్లాడుకుంటారు ..!

GRK