Phool Makhana :బహుశా తామర గింజలు Phool Makhana అంటే ఎవరికి తెలియదు. ఇవి ఫూల్ మఖనా గానే అందరికి తెలుసు. వీటినే ఫాక్స్ నట్స్ అని కూడాపిలుస్తారు . వీటిని ఎక్కువగా నార్త్ ఇండియా లో వాడుతారు. ప్రతి పండగ కి వీటితో వంటలు చేసి నైవేద్యం గా సమర్పిస్తుంటారు . ఇది తూర్పు ఆసియా లో ఎక్కువగా వాడే ఆహార పదార్ధం అని చెప్పవచ్చు. వీటిని బీహార్ లో ఎక్కువగా పండిస్తారు. ఇవి ఎక్కువగా తెలుపు ముదురు గోధుమ రంగులలో దొరుకుతాయి. వీటిని పచ్చిగా,లేదా ఎండబెట్టి, ఉడకబెట్టి తింటుంటారు. వీటిని పచ్చిగా తినడం చాల మంచిది. వీటిని కూరలు, స్వీట్స్, సూప్స్ మరియు స్నాక్స్ గా కూడా తింటుంటారు. సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ,సోడియం తక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ,మెగ్నీషియం, పాస్పరస్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే ఫూల్ మఖనా తో పాయసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
ఫూల్ మఖనా పాయసం తయారు విధానం
ఫూల్ మఖనా : 50గ్రా
పంచదార :150 గ్రా
పాలు :1 లీటర్
జీడిపప్పు :30 పలుకులు 20 నిముషాలునాన బెట్టుకున్నవి
నెయ్యి : 2 స్పూన్స్
యాలకలపొడి :కొంచెం
రోజ్ వాటర్ 10 చుక్కలు
పాన్ లో నెయ్యి వేసుకుని కరిగినతర్వాత అందులో మఖనాలు వేసి స్టవ్ చిన్న మంట లో ఉంచి 5 నిమిషాల పాటు కలుపుతూ వేపుకోవాలి.వేగడం అయిన వెంటనే వాటిని తీసి చల్లని నీళ్ళ లో వేసి రెండు నిముషాలు పాటుఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాయసం తయారు చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి.ఆ గిన్నెలోపాలు ,పంచదార పోసి కలుపుతూ అరలీటరు అయ్యేదాకామరిగించుకోవాలి.
ఇప్పుడు మాఖన ని సగానికి మరిగించుకున్న పాలల్లో వేసి మరిగించండి,
ఆ మరుగుతున్న పాలల్లో రోజ్ వాటర్,నానబెట్టిన జీడిపప్పు, యాలకపొడి వేసి కలుపుకోవాలి.తరువాత మఖనా మెత్తబడే దాక ఉడికించి ,వడ్డించేసుకోవడమే.ఇది మంచి సువాసనతో రుచిగా ఉంటుంది.