భూకేటాయింపులపై హైకోర్టులో పిల్

విజయవాడ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారని, బోగస్, షెల్ కంపెనీలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదా ఎసీబీతో విచారణ జరిపించాలని కోరతూ రిటైర్డ్ న్యయమూర్తి, ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జె శ్రావన్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయెజన వాజ్యం దాఖలు చేశారు. సెప్టెంబర్ నెలలో తొలి సారి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా పూర్తి సమాచరంతో రావాలన్న హైకోర్టు సూచనల మేరకు గతంలో పిల్‌ని ఉపసంహరించుకున్నారు.

“ఏపీలో 14900 ఎకరాలను సుమారు 4వేల కంపెనీలకు ఏపీఐఐసీ కేటాయించిందని, వీటిలో ఎక్కువ శాతం బోగస్, షెల్ కంపెనీలని” పిటీషనర్ పేర్కొన్నారు. 400 కంపెనీలకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా కోరగా 200 కంపెనీలకు చెందిన వివరాలను అధికారులు తెలిపారు. వీటిలో 25 కంపెనీలు మాత్రమే సక్రమమైనవని పిటీషనర్ వాదన. సుమారు రెండు వేల పేజీల డాక్యుమెంట్‌లను పిటీషనర్ శ్రావణ్‌కుమార్ హైకోర్టు ముందు ఉంచారు.

నవ్యాంధ్రలో రాష్ట్ర హైకోర్టు ఏర్పాడిన తరువాత ఇది తొలి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా నమోదు అయ్యింది.