ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగితే,జిమ్‌కి వెళ్లి తగ్గించుకోవచ్చు . అదే మెంటల్ టెన్షన్ల వల్ల బరువు పెరిగితే తిరిగి మెంటల్ పీస్ వల్లే తగ్గే అవకాశముందని పరిశోధనల్లో తేలింది. టెన్షన్లు ,ఒత్తిడి ఎక్కువైతే… మన శరీరంలో కార్టిసాల్ అనేది ఎక్కువగా రిలీస్ అయి శరీరం లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.
కొంత మందికి పొట్ట చుట్టూ రింగ్ లాంటిది వస్తుంటుంది. దానికి కారణం ఈ కార్టిసాలే. దీని అంతు చూస్తే తప్ప కొవ్వు కరగదు. అలా జరగాలంటే ఒకేమార్గం పాజిటివ్ గాఆలోచించడం. ఈ కార్టిసాల్ వల్ల బీపీ కూడా వస్తుంది. పరిశోధకులు వివరం గా చెబుతున్నది ఒకటే. జిమ్‌లలో ఎంత వ్యాయామాలు చేసిన, శారీరకం గా ఎంత శ్రమించినా,బరువు తగ్గాలంటే ఈ శ్రమతోపాటూ,పాజిటివ్ ఫీలింగ్స్ కూడా పెరగాల్సిందే అని సూచిస్తున్నారు.
శరీరానికి సంబందించి పాజిటివ్ ఫీలింగ్స్ బ్రెయిన్లోఉంటే… ఆటోమేటిక్‌గా బరువు తగ్గడం మొదలవుతుందని బలంగా చెబుతున్నారు.”నేను బరువు తగ్గుతున్నాను. ఇవాళ గ్యారెంటీ గా ఓ పావుకేజీ తగ్గుతాను.ఈ రోజు ఆహ్లాదంగా ఉన్నాను. నేనుప్రశాంతం గా ఆలోచిస్తున్నాను. ఇలా అన్నీ మంచి ఆలోచనలతో మైండ్‌ని నింపేయాలట. మనస్ఫూర్తి గా ఇలా చేయగలిగితే… బరువు తగ్గడమే కాదు… ఆరోగ్యానికీ ఎంతో మంచి జరుగుతుందని అంటున్నారు డాక్టర్లు.
బ్రెయిన్ అంతా పాజిటివ్ గా ఉండడం వల్ల గుండె బాగా పనిచేస్తుందట. వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎక్కువ కాలం జీవిస్తారనీ, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారనీ, డిప్రెషన్ బాగా తగ్గిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఆహారం తినకుండా కడుపు మాడ్చుకోవడం, జిమ్పైనే పూర్తిగా ఆధారపడటం వంటివి కరెక్టు కాదంటున్నారు.
అన్నీ తింటూనే, వీలైనంతవరకూ నడుస్తూ, ఇళ్లు, ఆఫీసుల్లో ఎవరి పనులు వాళ్లే చేసుకుంటూ ఉంటే, బరువు తగ్గడం ఖచ్చితం గా తగ్గుతారని చెబుతున్నారు..ఇంకా ఎందుకు ఆలస్యం ప్రశాంతం గా హాయి గా బరువు తగ్గడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి మరి.