NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఈడీకి ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు..! టీడీపీలో టెన్షన్..!!?

దేశంలో చంద్రబాబు లాంటి రాజకీయ నేత ఎవరూ ఉండరు..! 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో బాబుపై ఒక్క కేసు నిరూపించబడలేదు..! అంటే ఆయన నిక్కచ్చి మనిషి, నిజాయితీకి నిలువుటద్దం అని కాదు..! చట్టానికి దొరకకుండా.., చట్ట ప్రకారమే తప్పులు చేయడం.., అంటే చట్టాలను వాడుకునే అవినీతి చేయడంలో ఆయన నేర్పరి..! ఎక్కడైనా దొరికితే ఆయనకు ఉన్న “స్పెషల్ మేనేజ్మెంట్ స్కిల్స్” ద్వారా బయటపడేవారు..! అటువంటి చంద్రబాబుని కేసీఆర్ పక్కాగా ఇరికించారు. అయిదేళ్ల కిందట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన “ఓటుకి నోటు” కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరిగింది..! ఈడీకి కీలక ఆధారాలు చిక్కాయి..!!

జెరూసలేం ముత్తయ్య మొత్తం చెప్పేసారు..!!

ఓటుకి నోటు కేసులో చంద్రబాబుని ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. కానీ దీనిలో చంద్రబాబు పాత్ర స్పష్టం. అందుకే ఈరోజు ఈడీ ముంగిట జెరూసలేం ముత్తయ్య కీలక వఙ్గమూలం ఇచ్చారు. ” చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరింది. మొత్తం చంద్రబాబే కారకుడు” అంటూ మత్తయ్య ఈడీకి కీలక సమాచారం ఇచ్చారు. నాడు జరిగినవి మొత్తం పూస గుచ్చినట్టు చెప్పేసారు.

‘‘నేను టీడీపీ అభిమానిని, చాల కాలం పార్టీకి పనిచేసాను. 2015 మహానాడు సందర్భంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి, నేను కలిసి ఓటుకి నోటు అంశంపై మాట్లాడాము. నాడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం మాట్లాడాలని చంద్రబాబు, రేవంత్ రెడ్డి నన్ను రమ్మన్నారని జిమ్మిబాబు అనే వ్యక్తి చెప్పారు. మహానాడు జరుగుతున్నప్పుడే నేను, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ప్రత్యేకంగా ఒక గదిలో మాట్లాడాము. అక్కడే రేవంత్‌రెడ్డి నాతో ఈ డీల్‌ మాట్లాడారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ చేత టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ఒప్పించే బాధ్యత నాకు అప్పజెప్పారు. అందుకు గాను అతనికి రూ. 5 కోట్లు, నాకు రూ. 50 లక్షలు ఇస్తామన్నారు. ఒకవేళ ఆ ఓటింగ్ కి స్టీఫెన్సన్ హాజరుకాకపోతే రూ. 3 కోట్లు ఇస్తామని కూడా చెప్పామన్నారు. వాళ్ళిద్దరి (చంద్రబాబు, రేవంత్‌రెడ్డి) సూచనల ప్రకారం నేను స్టీఫెన్‌సన్‌తో చర్చించాను. ఈ డీల్ గురించి చెప్తే… స్టీఫెన్సన్ నేరుగా రేవంత్ రెడ్డిని కలవాలని అన్నారు. దీంతో చంద్రబాబు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి డబ్బులతో సహా స్టీఫెన్‌సన్ దగ్గరు వెళ్లారు. అప్పుడే రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికిపోయారు. రేవంత్‌రెడ్డి అరెస్టు తర్వాత నేను నారా లోకేష్ ని కలిస్తే.., తెలంగాణ ఏసిబితో మాట్లాడుతున్నాం.., డీల్ చేసుకుంటున్నాం.., మీరు విజయవాడలో ఉండండి అంటూ సలహా ఇచ్చారు” అంటూ ముత్తయ్య మొత్తం కథ విప్పారు.

తర్వాత ఏం చేయనున్నారు..!

ఈడీ ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో మొదటి నుండి కీలకమైన సాక్ష్యంగా ఉన్న ముత్తయ్య మొత్తం చెప్పేయడంతో కేసు శోధించడం ఈడీకి సులువయింది. అయితే తెలంగాణ ఏసీబీలో 2016 తర్వాత ఈ కేసు ముందుకు వెళ్ళలేదు. నాడు కొన్ని రాజకీయ ఒప్పందాలు, రాజకీయ కారణాలతో కేసుని ఆపేసారు. దీంతో ఆ ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు కూడా చర్చకుండానే వదిలేశారు. ఇన్నాళ్ల తర్వాత ఈ కేసు మళ్ళీ తెరపైకి రావడం.., ఆధారాలు కూడా లభించడం మళ్ళీ చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఏం చేయనుంది అనేది కీలకంగా మారింది. వఙ్గమూలం ఆధారంగా రేవంత్ రెడ్డికి, చంద్రబాబుని నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరవ్వాలని ఆదేశించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

టీడీపీలో కొత్త గుబులు..!!

తెలుగు దేశం పార్టీలో ఇప్పటికే కొంత ఆందోళన నెలకొంది. పార్టీ భవిష్యత్తు ఏమిటా అంటూ క్షేత్రస్థాయిలో భరోసా కరువయింది. ఈ తరుణంలో పాత కేసు మళ్ళీ బయటకు రావడం.. రెండు వారాలు కిందటే సుప్రీమ్ లో కూడా ఈ కేసు విషయమై చర్చకు రావడం టీడీపీలో ఆందోళనకు దారి తీస్తుంది. పార్టీ బాధ్యతలను ప్రస్తుతం చంద్రబాబు మోస్తున్నప్పటికీ.., బయట పెద్దగా తిరగడం లేదు. రోజు సమీక్షలు, జూమ్ మీటింగ్ లకు పరిమితం అవుతున్నారు. ఒకవేళ ఓటుకి నోటు కేసులో చంద్రబాబుకి ఈడీ నోటీసులు ఇస్తే మాత్రం సరైన సమాధానం కూడా ఇచ్చుకోలేని స్థితిలో టీడీపీ ఉంది.

 

 

 

 

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju