బాహుబలి సిరీస్ తో ప్రభాస్ నిజానికి అంతర్జాతీయ స్టార్ అయ్యాడు. భారతదేశ సినీ చరిత్రలో బాహుబలి ఓ పేజీని లిఖించుకుంటే.. ప్రభాస్ మాత్రం తన రేంజ్ ను పెంచుకున్నాడు. బాహుబలి తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతున్నాయి. సాహో కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన సినిమానే.
సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ సినిమాలన్నీ అదే రేంజ్ లో వస్తున్నాయి.
అయితే.. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ డైరెక్ట్ గా తొలిసారి బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు అనేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. భారతదేశ సినీ అభిమానులే ఆశ్చర్యానికి గురయ్యారు.
అది కూడా మామూలు గీమూలు సినిమా కాదు.. ఒక ఇతిహాసాన్ని తెరకెక్కిస్తున్నారు.. అనేసరికి ఇక ప్రభాస్ పై, ఆ సినిమాపై వెంటనే అంచనాలు పెరిగిపోయాయి. ఆదిపురుష్ అంటూ సినిమా పేరు ప్రకటించగానే.. ఈ సినిమా రేంజ్ ఏంటో అప్పుడే అర్థం అయిపోయింది.
అందరూ ఊహించినట్టుగానే ఆదిపురుష్ సినిమా ఏమీ అట్టాంటి ఇట్టాంటి సినిమా కాదండోయ్. దాని రేంజ్ మామూలుది కాదు. దాని రేంజ్ తెలుసుకుంటే మీ కళ్లు గిర్రున తిరుగుతాయి. అసలు.. ఈ సినిమాతో భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఎక్కడికో వెళ్లిపోతుందట. ఆదిపురుష్ కథ కూడా అలాగే ఉందట.
అందరికీ తెలిసినట్టుగానే ఆదిపురుష్ సినిమా ఇతిహాసం రామాయణాన్ని బేస్ చేసుకొని వస్తోంది. ప్రభాస్ రాముడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా మొత్తం 3డీ ఫార్మాట్ లో తెరకెక్కబోతోంది. అంటే అందరూ 3డీ గ్లాసులు పెట్టుకొని ఈ సినిమా చూడాలన్నమాట. 3డీ ఫార్మాట్ లో వచ్చే సినిమాల్లో సన్నివేశాలన్నీ మన ముందే జరిగినట్టుగా కనిపిస్తాయి. అదో థ్రిల్ అంతే.
ఇక.. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అదిరిపోయేలా ఉంటాయట. ఈ సినిమాలో విలన్ రోల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే విలన్ రోల్ కోసం బాలీవుడ్ లో పెద్ద నటుడినే తీసుకోనున్నారట.
ఇక.. ఈ సినిమా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందబోతోంది. 2021లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా… 2022లో ఈ సినిమా రిలీజ్ కు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఏకకాలంలో తెరకెక్కించనుండగా… మిగిలిన అన్ని దక్షిణ భాషల్లో డబ్ చేయనున్నారు. మొత్తానికి అన్నింటినీ పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని మరీ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు డైరెక్టర్ ఓం రౌత్. ఈ సినిమా కోసం పురాణాలను కూడా బాగానే వడబోసినట్టున్నాడు ఓం రౌత్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!