ప్రశాంత్ నీల్ కన్నడ హీరో యష్ తో తీసిన కేజీఎఫ్ చాప్టర్- 1 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక ఇప్పుడు తయారవుతున్న కేజీఎఫ్ చాప్టర్- 2 పాన్ ఇండియన్ సినిమాగా రూపొందడమే కాదు కేజీఎఫ్ చాప్టర్- 2 తో యష్ కి పాన్ ఇండియా స్టార్ అన్న ఇమేజ్ రావడం గ్యారెంటీ అందరూ ఫిక్సైపోయారు. కేజీఎఫ్ చాప్టర్- 1 మేకింగ్ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్ఠించిన వసూళ్ళని చూసిన టాలీవుడ్ స్టార్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ ఒక పవర్ ఫుల్ మాఫియా డాన్ గా చూపించనున్నారట. రీసెంట్ గా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కనుందని వార్తలు రాగా ఇప్పుడు ఈ న్యూస్ వచ్చి షాకిచ్చింది.
అయితే “కేజీయఫ్” లో రాకీ భాయ్ రోల్ పదిరెట్లు ఉండేలా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ కు మాస్ లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. నిజంగా ఎన్టీఆర్ క్యారక్టర్ ని ప్రశాంత్ నీల్ ఆ రేంజ్ లో డిజైన్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీతో భీబత్సం సృష్ఠించడం ఖాయం అని నందమూరి ఫ్యాన్స్ చెపుకుంటున్నారు.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” టైటిల్ తో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పోరాట యోధుడు కొమరం భీం గా కనిపించబోతున్న ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరెస్ నటిస్తుంది. కాగా ఎప్పుడెప్పుడు తారక్ పాత్రని రివీల్ చేస్తూ రాజమౌళి టీజర్ రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!