Sonusood : ప్రతీ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరొక హీరో చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో కథ మొత్తం విన్న హీరో ఈ కథ నాకంటే పలానా హీరోకైతే పర్ఫెక్ట్ అని దర్శక, రచయితలకి సూచించిన హీరోలు.. సందర్భాలు కోకొల్లలు. మహేష్ బాబు చేసిన ‘పోకిరి’ సినిమా వాస్తవంగా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా. కానీ ఎందుకనో పవన్ కళ్యాణ్ ఈ సినిమా మిస్ అయ్యాడు. ఇదే సినిమాతో దాదాపు 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాశాడు.
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇట్లు శావణి సుబ్రమణ్యం’ సినిమా కథ కూడా ముందు పవన్‌తో చేయాలనుకున్నాడు పూరి జగన్నాధ్. కానీ రవితేజతో చేసి హిట్ కొట్టాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవా కథ కూడా త్రివిక్రం పవన్ కోసం తయారు చేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఈ కథ నాకంటే తారక్ చేస్తే చాలా బావుంటుందని చెప్పడంతో ‘అరవింద సమేత’ తారక్ తో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. ఇలా చాలా సినిమాలు ఒక హీరో చేయాల్సినవి ఇంకో చేసి సూపర్ హిట్ అందుకున్నారు.
Sonusood : పూరీ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సోనూసూద్ తో చేయనున్నారట..!
కాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేయాలనుకున్న జనగణమన సోనూసూద్ తో చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. గత కొంతకాలంగా పూరి జగన్నాధ్ ‘జనగణమన’ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నప్పటికి ఎందుకనో ఈ ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడటం లేదు. మహేష్ డ్రాపవడంతో.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, కన్నడ రాకింగ్ స్టార్ యష్.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ..ఇలా పలువురు స్టార్ హీరోల పేర్లు ప్రచారంలో నిలిచాయి. కానీ ఇప్పుడు పూరీ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సోనూసూద్ తో చేయనున్నారట. మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!