జాతీయం న్యూస్

CEC: కేంద్ర ఎన్నికల సంఘం సీఐఓగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్

Share

CEC: కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా (సీఈసీ) రాజీవ్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమించే ఆనవాయితీలో భాగంగా రాజీవ్ కుమార్ ను ఎన్నికల సీఈసీ గా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల నియమించారు. రాజీవ్ కుమార్ నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

 

దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్ లో ఆదివారం రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన సుశీల్ చంద్ర నిన్న పదవీ విరమణ అయ్యారు. రాజీవ్ కుమార్ ఝార్ఖండ్ రాష్ట్ర క్యాడర్ కు చెందిన 1864 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో రాజీవ్ కుమార్ ఆర్ధిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.


Share

Related posts

Vijaya Sai: విజయసాయిపై మాజీ మంత్రి వడ్డే ‘పచ్చకామెర్ల సామెత’ చెబుతూ ఘాటు వ్యాఖ్యలు

somaraju sharma

‘జలవివాదం’ ముగించేందుకు కేసీఆర్ రెడీ అయిపోయాడు..! మరి జగన్?

siddhu

జగన్ – ఆనం – ఆ సీనియర్ మంత్రి : కాన్ఫరెన్స్ కాల్ ?

sekhar