బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ మిస్సింగ్.. మెగా ఫ్యామిలీ, పీకే ఫ్యాన్స్ మీదనే డౌట్..!

RGV OTT Spark: Be Ready for
Share

రామ్ గోపాల్ వర్మను ఎంత గెలికితే అంత రెచ్చిపోతాడు. ఆయన్ను పట్టించుకోకుండా వదిలేస్తే ఆయన కూడా పట్టించుకోడు కానీ.. ఒక్కసారి ఎవరైనా ఆర్జీవీని గెలికారంటే ఇక అంతే.. వాళ్లతో పంతం పడతాడు. వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే వదలడు. అది ఆర్జీవీ స్టయిల్. అందరూ కథలను సృష్టించి సినిమాలు తీస్తుంటే.. ఈ మధ్య ఆర్జీవీ అన్ని నిజ జీవితాలను తీసుకొని సినిమాలు తీస్తున్నాడు. ఈ మధ్యలో వచ్చినవన్నీ అటువంటి సినిమాలే.

ram gopal varma rgv missing first look released
ram gopal varma rgv missing first look released

ఇప్పటికే తన బయోపిక్ ను కూడా ఆర్జీవీ ప్రకటించాడు. తాజాగా ఆర్జీవీ మిస్సింగ్ అని ఫిక్షనరీ రియాలిటీ అనే జోనర్ లో సరికొత్త సినిమాను ప్రకటించాడు ఆర్జీవీ.

ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదలయింది. ఆ ఫస్ట్ లుక్ లో ఆర్జీవీ మిస్సింగ్ కు సంబంధించిన అనుమానితులు.. పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, ఆయక కొడుకు.. అంటూ చెప్పుకొచ్చారు.

ram gopal varma rgv missing first look released
ram gopal varma rgv missing first look released

తను మిస్సయినప్పుడు జరిగిన సంఘటనలతో ఈ సినిమా ఉంటుందని వర్మ తన ట్విట్టర్ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. ఇక రెండో లుక్ పోస్టర్ ను ఆదివారం అంటే అక్టోబర్ 4న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నాడట. ఆ పోస్టర్ లో పీకే ఉంటాడు అనే హింట్ కూడా ఇచ్చాడు వర్మ.

ఆర్జీవీనే ఈ సినిమాను సమర్పిస్తుండగా… అదిర్ వర్మ ఈ సినిమాకు డైరెక్టర్. చటర్జీ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. అసలు ఆర్జీవీ కిడ్నాప్ ఏంటో… అందులో అనుమానితులు పీకే ఫ్యాన్స్ ఏందో? మెగా ఫ్యామిలీ ఏందో? మాజీ ముఖ్యమంత్రి ఏందో? ఆయన కొడుకేందో? ఇవన్నీ తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. అప్పుడే ఈ కిడ్నాప్ గొడవ ఏంటో తెలుస్తుంది.


Share

Related posts

బిగ్ అప్‌డేట్ : రాధేశ్యామ్ కి రిలీజ్ డేట్ లాక్ చేసిన ప్రభాస్ ..?

GRK

ఇక జాక్స్ లేడు

Siva Prasad

ఇది ట్విస్ట్ లకే ట్విస్ట్ :  ఆ పార్టీ లోకి హర్ష కుమార్ ?? 

sekhar