రవితేజ క్రాక్ సందడి అక్కడ కూడా మొదలు..!

రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చాలాకాలం తర్వాత భారీ కమర్షియల్ సక్సస్ ని సొంతం చేసుకున్న raviteja మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద 4 సినిమాలతో పోటీ పడి సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఇండస్ట్రీ వారి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. raviteja కి దాదాపు 3 ఏళ్ళ తర్వాత krack సినిమాతో సాలీడ్ హిట్ దక్కడం తో ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. ఠాగూర్ మధు నిర్మాతగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ అందరి ఫేట్ ని మార్చేసింది. ఈ సినిమా తర్వాత అటు శృతి హాసన్.. ఇటు దర్శకుడు గొపిచంద్ మలినేని మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి వచ్చి ఆఫర్ అందుకుంటున్నారు.

ఇప్పటికే ఇటు దర్శకుడు gopichand malineni కి స్టార్ హీరోల నుంచి .. నిర్మాతల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలోనే క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే గోపీచంద్ మలినేని చేతిలో ఈ ఏడాది 3 ప్రాజెక్ట్స్ పడే అవకాశం ఉందంటున్నారు. ఇక శృతి హాసన్ krack తర్వాత మరోసారి మహేష్ బాబు తో సినిమా చేయబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్ కంప్లీట్ చేసింది. తమిళంలో లాభం అన్న సినిమా చేసింది. ఈ సినిమా సక్సస్ అయితే ఇక కోలీవుడ్ లో కూడా శృతి హాసన్ ట్రాక్ ఎక్కేసినట్టే.

ఇక మన మాస్ మహారాజ raviteja ఖిలాడి సినిమాని సెట్స్ మీద కి తీసుకు వచ్చాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ కూడా రాబోతోంది. కాగా raviteja క్రాక్ జోరు చూపించడానికి ఓటీటీ లో కూడా రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా లో ఈ నెల 29 నుంచి krack సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్స్ లో సంచలనం సృష్ఠించిన రవితేజ క్రాక్ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే సంచలనం సృష్ఠించబోతోంది.