RC15 : విలక్షణ దర్శకుడు శంకర్ చేసే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో భారత ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సామాజిక అంశాలను గ్రాండ్ గా తెరకెక్కించడంలో… సామాజిక సమస్యలను ప్రజల ముందుకు విన్నూత రీతిలో తీసుకుని రావడంలో శంకర్ నైపుణ్యత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసింపబడింది.
అటువంటి దర్శకుడు ఇప్పుడు మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడని ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాలు అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. అసలు రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ సినిమా అంటే ఇక దాని పై అంచనాలు ఎలా ఉంటాయి? పైగా ఇది పాన్ ఇండియా సినిమా ప్రకటించడం…. దిల్ రాజు లాంటి నిర్మాత ఈ కథను ఓకే చేసి నిర్మించడం చూస్తుంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఇప్పుడే మొదలైపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్…. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చిత్రీకరణ లో బిజీగా ఉన్నాడు.
ఒక వారం రోజుల్లో అతనికి… ఆలియా భట్ కి మధ్య కొన్ని ఆసక్తి కరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు/ శంకర్ కూడా ఇండియన్ 2 షూటింగ్ పై దృష్టి సారించారు. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నటీనటులు…. టెక్నీషియన్ల వివరాలపై ఇప్పుడిప్పుడే అప్డేట్స్ రావడం కూడా మొదలయ్యాయి. ఆస్కార్ అవార్డు విజేత…. అకాడమీ అవార్డు ద్వారా దేశ ప్రతిష్టను పెంచిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ ఆర్. రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ట్విట్టర్ లో ఒక అభిమాని తెలుగులో సినిమాలు చేస్తున్నారా అని అడిగినప్పుడు త్వరలోనే ఒకటి చేస్తున్నాను అని దీనిపై హింట్ ఇచ్చారు. ఇప్పటికే తో శంకర్ తన చిత్రాల్లో ఎక్కువ శాతం రెహమాన్ తోనే కలిసి పనిచేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి కూడా అతనినే లాక్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ఉన్న కథానాయిక కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు యువ కథానాయయికని చూసే పనిలో కియారా అద్వానీ పేరు బయటకు వచ్చింది, ఇంతకుముందు వీరిద్దరూ ‘వినయ విధేయ రామ’ సినిమాలో కలిసి మెరిపించారు. తెలుగు ప్రేక్షకులను ఈ జోడీ బాగా ఆకట్టుకుంది. ఆమెకు బాలీవుడ్లో ఇప్పుడు మంచి క్రేజ్, స్టార్ డమ్ వచ్చాయి. ఇలా అద్దిరిపోయే కాంబినేషన్లతో రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ సినిమా షూటింగ్ మొదలు కాకముందే అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!