చాలా మంది ఎంత ఫిట్ గా ఉన్నా.. పొట్ట చుట్టూ కొవ్వు మాత్రం ఉంటుంది. అందుకు కారణం మనం తీసుకునే రకరకాల ఆహారం మూలంగా అక్కడ కొవ్వు ఏర్పడటం. ఈ కొవ్వు మూలంగా బెల్లీ ఫ్యాట్ సమస్య ఏర్పడుతుంది. దీనిని తగ్గించుకోవడానికి చాలా మంచి రకరకాల వర్కౌట్స్ ను చేసేస్తూ, రకరకాల ఆహార చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయినా బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గదు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడితే మాత్రం అసలెందుకు బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదో తెలుసుకోండి. అందుకోసం ఈ చిట్కాలను చదివేయండి మరి.
అయితే ముఖ్యంగా మీ బరువును కోల్పోకపోవడానికి గల కారణాలలో మొదటిది మీరు తీసుకునే డైట్. పరిమితమైన డైట్ ను మెయిన్ టెన్ చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ఇదిలా ఉంటే బరువును తగ్గడానికి పరిమితమైన ఆహారం తీసుకుంటూ కేలరీలను తగ్గించే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల మీరు తీసుకునే ఆహారం నుంచి శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇలా కోల్పోవడం మూలంగా శరీరంలోని కొవ్వుకు బదులుగా కండరాలు, అదనపు నీటిని శరీరం నుంచి కోల్పోవడం వలన బరువును కోల్పోతారు. దానివల్ల బెల్లీ ఫ్యాట్ మాత్రం ఎంత మాత్రం తగ్గదు.
అలాగే బరువును తగ్గించుకోవడానికి చేసే మరో ప్రయత్నమే వర్కౌట్స్. ఈ వర్కౌట్స్ కూడా తప్పుగా చేస్తే మాత్రం మీరు బరువు కోల్పోయే అవకాశమే లేదు. అందులోనూ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా కష్ట తరం. ఎందుకంటే బరువును కోల్పోవడానికి మీరు చేసే జాగింగ్, కార్డియో వర్కౌట్స్ వల్ల కొంత బరువు తగ్గినా కేలరీలు మాత్రం బర్న్ అవుతాయని గ్యారంటీ లేదు. దీనికి బదులుగా శరీరానికి మేలు చేసే వ్యాయామాలను చేయడం మంచిది. అలాగే నిద్రలేమి కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో అడ్డువస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనిషికి సరిపోయే నిద్రలేకపోయినా, డైట్ ను కఠినంగా పాటించినా బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశాలుండవు.
అలాగే మనిషి ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని పెంచుతాయని ఓ అధ్యయనంలో తేలింది. దీనివల్ల జీవక్రియ తగ్గుతుంది. దీనిమూలంగా బరువును కోల్పోయే అవకాశాలు, బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశం తగ్గుతూ ఉంటుందని తేలింది. అలాగే బెల్లీ ఫ్యాట్ ను పెంచడంలో మధ్యం కూడా తోడ్పడుతుందని తెలిసింది. దీని సేవించడం మూలంగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోలేము. ఆల్కహాలల్లో, తినే మాక్ టెయిల్స్ లో అధిక కేలరీలు ఉండటం వల్ల పొట్ట చుట్టు కొవ్వు మరింత అధికంగా పేరుకుపోయేలా చేస్తుంది. అయితే ఈ మత్తు పానియాలల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం మూలంగా అధిక బరువు పెరిగే అవకాశముంటుంది. అందులోనూ బెల్లీ ఫ్యాట్ మరింత పెరగాడానికి కూడా ఆస్కారం ఉంటుంది.