RGV: కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్కినేని సుమంత్ రెండో పెళ్లి గురించి ఆర్జివి వైరల్ కామెంట్ చేశారు. సుమంత్ నీకు ఇంకా బుద్ధి రాలేదా అంటూ.. కాంట్రవర్సీ కామెంట్ చేశారు. పవిత్ర అనే అమ్మాయితో రెండో పెళ్ళికి సుమంత్ రెడీ అవుతూ ఉండటం తో పాటు పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉండటంతో.. ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్ చేశారు.
ఒకసారి పెళ్లయిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా..? నీ కర్మ అదే రీతిలో పవిత్ర కర్మ అంటూ రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2004వ సంవత్సరంలో సుమంత్ తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకోవడం జరిగింది. అనంతరం వారి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుని ఇప్పుడు తాజాగా సమంత రెండో పెళ్ళికి రెడీ అవ్వడం తో ఈ వార్త సెన్సేషన్ గా మారింది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నే హీరో సుమంత్ “ప్రేమకథ” చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలో తండ్రి ఇచ్చారు. అక్కినేని ఫ్యామిలీ తో రాంగోపాల్ వర్మ కి మంచి అటాచ్మెంట్ ఉండటంతో తాజాగా సమంత పై చేసిన కామెంట్లకు.. సోషల్ మీడియాలో భారీగా రెస్పాన్స్ వస్తోంది. కొంత మంది బాధితులు తీసుకుంటే మరికొంతమంది రామ్ గోపాల్ వర్మ కి సినిమాలు లేక ఈ విధంగా కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు అని అంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!