Pawan Rana: మలయాళం సూపర్ డూపర్ హిట్ మూవీ “అయ్యప్పన్ కోషియం” సినిమాని తెలుగులో పవన్.. రానా కలిసి నటిస్తూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారి రానా పవన్ కళ్యాణ్ తో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. గతంలో రానా.. పవన్ కళ్యాణ్ నటించిన “పంజా” సినిమా ఆడియో ఫంక్షన్ కి రాగా తర్వాత ఇప్పుడు పవన్ తో కలిసి నటించడంతో సినిమాలో.. రాణా- పవన్ కాంబినేషన్ సన్నివేశాలు ఎలా ఉంటాయి అన్నది సస్పెన్స్ గా మారింది.
ఈ సినిమాలో పోలీస్ పాత్రలో భీమ్ల నాయక్ పాత్ర పవన్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఈ తరుణంలో పవన్ క్యారెక్టర్ కి సంబంధించిన పార్టీ వర్కింగ్ షూటింగ్ వీడియో సినిమా యూనిట్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే తో పాటు డైలాగులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా పవన్ తో పాటు నటిస్తున్న రానా తాజాగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటిస్తాను అని ఎప్పుడు ఊహించలేదు అని, ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందని తెలిపారు. షూటింగ్ సెట్లో ఆయన ఉన్నంతసేపు.. చాలా కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుందని, ప్రతి దాని పై పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉందని.. ఆయన ఒక పుస్తకం లాంటి వారిని రానా ఇటీవల తెలిపారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికిపైగా అవడంతో సినిమా రిలీజ్ కోసం దగ్గుబాటి అదే రీతిలో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.