RRR: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లమంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమాతో కొత్త చరిత్ర సృష్ఠించిన రాజమౌళి ఇపుడు ఆర్ఆర్ఆర్ మూవీతో ఎలాంటి సంచనాలు సృష్ఠిస్తారో అని అన్నో అంచనాలతో చెప్పుకుంటున్నారు. ఇది ఇద్దరు పోరాట యోధుల కథ. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ ల కథ ఆధారంగా ఫిక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందిస్తున్నారు. డీవీవీ దానయ్య దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇంత భారీ చిత్రం రిలీజ్ అంటే రాజమౌళి చేసే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన ప్రతీ సినిమాకు ప్రమోషన్స్ చాలా కొత్త తరహాలో నిర్వహిస్తూ సినిమాపై అసాధారణమైన అంచనాలను పెంచేస్తారు. ఇప్పుడు రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద అంతకంటే మరో స్థాయి అనేట్టుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి అంతకంతా ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్.టి.ఆర్, చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన టీజర్స్ ఇప్పటికీ జనాలు మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నారు.
RRR: ఇందులోనూ చరణ్, తారక్ కనిపించబోతున్నారట.
ఇక దోస్తీ సాంగ్ సినిమా రెంజ్‌ను ఇంకా పెంచితే ఇటీవలే వచ్చిన నాటు నాటు సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇద్దరు హీరోలను నాటు నాటు సాంగ్‌లో చూస్తే అభిమానులకే కాదు ప్రేక్షకులందరికీ రెండు కళ్ళు చాలలేదు. అలాంటి సాంగ్ మరో రేంజ్లో ఉండబోయో థర్డ్ సింగిల్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ మరో లెవల్ అనే స్థాయిలో ఉంటుందట. ఇందులోనూ చరణ్, తారక్ కనిపించబోతున్నారట. ఎం.ఎం.కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ సాంగ్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ రానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!