Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే వీళ్లు విడాకులు తీసుకుని షాకిచ్చారు. ఇప్పటికీ ఈ విడాకుల వ్యవహారాన్ని అటు సమంత అభిమానులు.. ఇటు చైతు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతు-సామ్ తమ విడాకుల విషయాన్ని ప్రకటించి మూడు నెలలు దాటినా.. ఈ విడాకుల మేటర్ ఇంకా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. కాగా, సమంత పలు సందర్భాల్లో ఈ విడాకుల విషయంపై స్పందించారు కూడా.
Samantha : ఊ అంటావా ఊఊ అంటావా అంటూ కౌంటర్..!
అయితే చైతు నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ తో కుర్రకారు ముందుకు వచ్చింది. ఈ పాటలోని లిరిక్స్ చైతు కి కౌంటర్ ఇచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో గుసగుసలు కూడా వినిపించాయి. కాగా, ఇప్పటికే పలు సందర్భాల్లో చైతన్య అభిమానులు సమంతకి ట్రోల్స్ చేశారు.
సమంతపై ట్రోల్స్..
తాజాగా వైరల్ అయిన ఊ అంటావా అనే ఐటమ్ సాంగ్ నుంచి సమంత పోజుల్లోని ఒక పోజుని సేకరించాడో అక్కినేని అభిమాని. దానికి చైతన్య అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న మరొక ఫొటోని యాడ్ చేసి.. “ఇదే సమంతకు కౌంటర్” అంటూ సదరు ఫ్యాన్ పంచ్ వేసాడు. సమంత బోల్డ్ గా డాన్స్ చేస్తే.. చైతన్య అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నాడని కౌంటర్ ఇచ్చాడు. అలాగే తాజాగా విడుదలైన బంగార్రాజు సినిమాలో చైతన్య పెళ్లిపై ఆసక్తి లేని ప్లేబాయ్ గా నటించాడు. ఈ సినిమాలో సింగిల్ లైఫ్ చాలా బెటర్ అని చెప్పే డైలాగ్స్ ఉన్నాయి. సమంత.. చైతూ ఎవరి దారిలో వారు వెళ్తుండగా సోషల్ మీడియాలో అభిమానులు సమంతను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఇది పంచ్ కు పంచ్ అన్న మాదిరి తయారైనది.