సికింద్రాబాద్ – తిరుపతి మధయ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైలు చార్జీలను రైల్వే శాఖ అధికారులు ఖరారు చేశారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు చార్జీల టేబుల్ శనివారం విడుదల చేశారు. చైర్ కార్ చార్జి రూ.1680లు, ఎగ్జిక్యూటివ్ చార్జ్ రూ.3080లు ఖరారు చేశారు. తిరుపతి నుండి సికింద్రాబాద్ కు చైర్ కార్ చార్జీ రూ.1625లుగా నిర్ణయించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రావడంతో తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు చాలా ఊరట కల్గనున్నది. ఎందుకంటే ఇంతకు అతి వేగంగా ప్రయాణించే ఈ ట్రైన్ వల్ల భక్తులకు ప్రయాణ సమయం చాలా అదా అవుతుంది. కేవలం ఎనిమిదిన్నర గంటల్లో తిరుపతికి చేరుకోవచ్చు.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయి నల్లగొండ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్ లలో ఆల్టింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు నెంబర్ (20701) సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు మొదలై మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తర్వాత తిరుపతి నుండి సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి స్టేషన్ నుండి మధ్యాహ్నం 3.15 గంటలకు స్టార్ట్ అయి రాత్రి 11,.45 గంటల వరకూ సికింద్రాబాద్ చేరుకోనుంది.
సికింద్రాబాద్ నుండి వివిధ స్టేషన్ లకు టికెట్ ధరలు ఇలా
నల్లగొండ వరకూ – రూ.470లు
గుంటూరు వరకూ – రూ.865లు
ఒంగోలు వరకు – రూ.1075లు
నెల్లూరు వరకు – రూ.1270లు
తిరుపతి వరకు – రూ.1680లు
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ చార్జీలు ఇలా
నల్లగొండ కు రూ.900లు
గుంటూరు కు రూ.1620లు
ఒంగోలుకు రూ.2045లు
నెల్లూరుకు రూ.2455లు
తిరుపతికి రూ.3080లు
IPS Officers Transfers: ఏపిలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు