ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ సంవత్సరం పోస్ట్ పో అయిన సంగతి తెలిసిందే. వాస్తవంగా RRR సినిమాని 2020 జూలై 30న విడుదల చేస్తామని షూటింగ్ మొదలు పెట్టినప్పుడే రాజమౌళి బృందం అధికారంగా ప్రకటించింది. అయితే అది అందరు అయ్యే పని కాదని అనుకున్నారు. అనుకున్నట్టుగానే RRR షూటింగ్ పూర్తి కాకపోవడం తో వేరే డేట్ ని ప్రకటించారు. 2021 జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు రాజమౌళి వెల్లడించాడు.
కానీ..కరోనా కారణంగా నెలలకి నెలలు షూటింగ్ కి బ్రేక్ పడటం తో రెండవ సారి rajamouli చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న విపరీతమైన ఆతృతతో దేశ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే లాక్ డౌన్ తర్వాత RRR షూటింగ్ మొదలు పెట్టిన rajamolui రాత్రంబవళ్ళు చిత్రీకరణ సాగిస్తున్నాడు. అంతేకాదు సమ్మర్ లో భారీ స్థాయిలో అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఖచ్చితంగా మాత్రం సమ్మర్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం వెల్లడించలేదు.
అయితే సమ్మర్ అంటే బాహుబలి సినిమా జూలై 10 న రిలీజైంది కాబట్టి అదే డేట్ ని rajamouli సెంటిమెంట్ గా భావించి RRR అదే డేట్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడని అనుకుంటున్నారు. అంతేకాదు అక్టోబర్ లో రిలీజ్ అన్న మాట కూడా వినిపించింది. అదే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటి అలీసన్ డూడీ తన సోషల్ మీడియా అకౌంట్ లో చెప్పేసింది. దాంతో టాప్ సీక్రెట్ గా ఉంచిన రిలీజ్ డేట్ బయటపడిపోయింది. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే rajamouli మాత్రం ఈ విషయాన్ని సమర్ధించే ప్రయత్నం చేశాడు. చూడాలి మరి ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.