NewsOrbit
న్యూస్ సినిమా

బాలయ్య బోయపాటి సినిమాలో సోనూసూద్..ఇక ధియోటర్లు బద్దలైపోవలసిందే..

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ వరస ఫ్లాపుల్లో ఉండగా ‘సింహా’ మూవీని తీసి బాలకృష్ణ కి భారీ కమర్షియల్ హిట్‌ను అందించాడు. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని కూడా అందుకుంది. ఇక సింహా తో ఫాం లోకి వచ్చిన బాలయ్యకు ‘లెజెండ్’ తో మరోసారి భారీ హిట్ ని ఇచ్చాడు దర్శకుడు బోయపాటి. అందుకే వీరి కాంబినేషన్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.

First Roar of BB3: Balakrishna roar in his style - tollywood

ఇకపోతే ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో, బాలయ్య కెరీర్‌లో 106 వ సినిమాగా మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం కొంతభాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ఇటీవ‌ల షూటింగ్స్‌కు కేంద్రం అనుమ‌తులు ఇవ్వ‌డంతో.. అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు బోయపాటి శ్రీను.. ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే.. డైలాగులతో పాటుగా విలన్‌తో భారీ ఫైట్స్, అదిరిపోయే చేజింగ్‌లు లాంటి అంశాలను ఆశిస్తారు అభిమానులు.

ఈ సినిమా కూడా హిట్ అందుకుంటే బాలయ్యకు, బోయపాటికి హ్యాట్రిక్ హిట్ అవుతుంది.. అదీగాక బాలయ్యకు గట్టి పోటీని ఇచ్చే విలన్ కావాలి.. అందుకే ఈ సినిమాలో విలన్‌గా ఇది వరకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఫిక్స్ చేశార‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న షూటింగ్‌లో జాయిన్ అవ్వ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే సంజ‌య్ ద‌త్ ఇటీవ‌ల క్యాన్స‌ర్ బారిన‌ప‌డ్డారు. దీంతో సంజ‌య్ ద‌త్ ప్లేస్‌లో బాలకృష్ణ తో ఢీ కోసం సోనూసూద్ ను రంగంలోకి దించితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో బోయపాటి ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Sonu Sood's witty response to boy asking for a PlayStation goes viral |  Trending News,The Indian Express

ఇప్ప‌టికే ఆయ‌న స్పందించిన‌ట్టు కూడా టాక్ న‌డుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారట. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో సోనూసూద్ క్రేజ్ మామూలుగా పెరిగిపోలేదు.. అందుకని ఇతన్ని విలన్‌గా నటింపచేస్తే అతని క్రేజ్ కూడా సినిమా విజయానికి తోడ్పడుతుంది అని చిత్రయూనిట్ ఆశిస్తున్నారట.. మొత్తానికి బాలయ్య బోయపాటి సినిమాలో సోనూసూద్ విలన్‌గా చేస్తే ధియోటర్లు బద్దలైపోవడం ఖాయం అంటున్నారట సినిమా ప్రేక్షకులు..

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu