NewsOrbit
జాతీయం న్యూస్

Attack On Doctors: వైద్యులపై దాడి చేసే వారి తాట తియ్యండి!రాష్ర్టాలకు కేంద్రం ఆదేశం!!

Attack On Doctors: వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా కేంద్రం శనివారం నాడు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.2020 ఎపడిమిక్ డిసీజెస్ సవరణ చట్టం కింద అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆయా ప్రభుత్వాలకు సూచించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు ఒక అత్యవసర లేఖను రాశారు.కరోనా సంక్షోభ సమయంలో అనేక చోట్ల వైద్యులు, వైద్యరంగ సిబ్బంది పై దాడులకు దిగడం పరిపాటిగా మారిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది.ఇప్పటికే వైద్యులపై దాడులను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించింది.దీంతో కేంద్రం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది.ఇందులో భాగంగానే రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు.

Squeeze the palm of those who attack doctors! Center orders states !!
Squeeze the palm of those who attack doctors! Center orders states !!

Attack On Doctors: అస్సాంలో దారుణం!

అస్సాంలోని ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఈ నెల మూడువ తేదీన చికిత్స పొందుతూ ఒక కరోనా రోగి మరణించగా అతని బంధువులు విధ్వంసానికి పాల్పడ్డారు.ఆ చికిత్సా కేంద్రం ఇన్చార్జి డాక్టర్ ,నర్సులపై వారు దాడిచేసి విచక్షణారహితంగా కొట్టడంతో వారు ఐసీయూలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ కేసులో ఇప్పటికే ఇరవై అయిదు మందిని అరెస్టు చేయడం జరిగింది.ఇదనే కాదు ఇంకా అక్కడక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగడంతో ఐఎంఏ ఉద్యమించింది.దీంతో కేంద్రం కూడా వైద్యులకు అండగా నిలిచింది.

వైద్యులపై దాడి చేస్తే ఇకపై జరిగేదేమిటి?

కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ర్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ఇకపై వైద్యులపై ఎవరైనా దాడి చేస్తే నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదవుతాయి.అంతేగాకుండా 2020 ఎపడిమిక్ డిసీజెస్ సవరణ చట్టం కింద అలాంటి వారికి కనీసం ఏడేళ్ల జైలుశిక్ష ,5లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.ఈ విషయాలన్నింటినీ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిన సర్క్యులర్ లో వివరించారు.”వైద్యులను, వైద్య సిబ్బందిని కాపాడుకోవటం అందరి బాధ్యత కావాలి.వారి సేవలు దేశానికి ఎంతైనా అవసరం.ఇకపై ఎవరైనా వారి మీద దాడికి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించండి “అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆ సర్కులర్ లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N