NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

భార్యతో సహా దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స

శ్రీలంక లో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సతీ సమేతంగా దేశం విడిచి పరారైయ్యారు. బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన గొటబాయ ముందుగానే ఈ తెల్లవారుజామున దేశం విడిచి వెళ్లిపోయారు. గొటబాయ రాజపక్స , ఆయన భార్య , ఇద్దరు అంగరక్షకులతో కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మేల్ – బౌండ్ మిలటరీ విమానంలో మాల్దీవులకు బయలుదేరారు. మాల్దీవులకు చేరుకున్న వీరిని పోలీసు భద్రత నడుమ రహస్య ప్రదేశానికి తరలించినట్లు మాలేలోని విమానాశ్రయ అధికారి తెలిపారు. అధ్యక్షుడు గొటబాయ దేశం విడిచి వెళ్లిన విషయాన్ని శ్రీలంక ప్రధాని కార్యాలయం దృవీకరించింది. బుధవారం అధ్యక్ష పదవికి రాజీనానా చేస్తానని ప్రకటించిన గొటబాయి దేశం విడిచి వెళ్లిపోయేందుకు అనుమతి ఇస్తేనే పదవి నుండి వైదొలగుతానని మంగళవారం మాట మార్చారు.

 

మూడు రోజుల క్రితం వేలాది మంది ప్రజలు అధ్యక్ష నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. భద్రతా సిబ్బందిని సైతం తోసేసి అధ్యక్షనివాసంలోకి నిరసన కారులు చేరుకున్నారు. మూడు రోజులుగా నిరసన కారులు అధ్యక్ష నివాసంలో హాల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడి నివాసం ప్రజలకు టూరిస్ట్ స్పాట్ గా మారింది. పిల్లలు, పెద్దలు అధ్యక్ష నివాసాన్ని సందర్శిస్తున్నారు. అక్కడి సౌకర్యాలు అనుభవిస్తున్నారు. నిరసనకారులు అధ్యక్షుడి నివాసం ముట్టడికి ముందే గొటబాయ భవనం నుండి రహస్య ప్రదేశానికి పరారు అయ్యారు. గత మూడు రోజులుగా రహస్య ప్రదేశంలో తలదాచుకున్న గొటబాయ ఈ రోజు తెల్లవారుజామున మాల్దీవులకు వెళ్లిపోయారు.

 

అయితే దేశం విడిచి వెల్లకముందే గొటబాయ రాజపక్స .. స్పీకర్ మహింద అభయ్ వర్ధనకు రాజీనామా లేఖను అందించినట్లు సమాచారం. మరో పక్క శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటునకు విపక్ష పార్టీలైన ఎస్ జే బీ, ఎస్ఎల్ఎఫ్ పీ నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఎస్ జేబీ నేత సాజిత్ ప్రేమదాస ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఆయనకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు, ప్రదాని రాజీనామాలు చేసిన పరిస్థితుల్లో అపధర్మ అధ్యక్షుడుగా పార్లమెంట్ స్పీకర్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను స్పీకర్ ప్రారంభించి 30 రోజుల్లోపు పార్లమెంట్ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో నిరసనకారుల హాల్ చల్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N