ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sridevi Drama Company :  వార్నీ.. యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల కూడా కామెడీ కింగ్ అయ్యాడుగా?

Sridevi Drama Company వార్నీ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల కూడా కామెడీ కింగ్ అయ్యాడుగా
Share

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ Sridevi Drama Company అనే షో గురించి తెలుసు కదా. ఈ షో స్టార్ట్ అయి కొన్ని ఎపిసోడ్సే ప్రసారం అయినా.. షోకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బుల్లితెర ప్రేక్షకులు సరికొత్తగా ఉన్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోను ఆదరిస్తున్నారు. ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ను అందించడమే లక్ష్యంగా ఈ షో ను రూపొందించారు.

Sridevi Drama Company latest promo
Sridevi Drama Company latest promo

అయితే ఈ షోలో ఎక్కువగా జబర్దస్త్ కంటెస్టెంట్లు కామెడీ చేస్తున్నా.. దీన్ని కేవలం కామెడీ షోగానే కాకుండా.. చాలా వెరైటీగా ప్లాన్ చేశారు. ప్రతి వారం ఈ షోకు కొందరు గెస్టులను పిలిచి.. వాళ్లతో డ్యాన్సులు, కామెడీలు చేయించడం.. పూర్తి స్థాయిలో ప్రతి వారం ఒక థీమ్ ను తీసుకొని.. ఆ థీమ్ ప్రకారం ఈవెంట్ ను చేయడం.. ఈ షో స్పెషాలిటీ

Sridevi Drama Company : ఈ వారం గెస్ట్ గా యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల

ఈ వారం ఎపిసోడ్ గెస్ట్ గా యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల వచ్చారు. అయితే.. ఆయన ఎక్కువగా కామెడీ చేయడం మనం ఎప్పుడూ చూడలేదు కానీ.. తాజాగా ఈ షోలో జబర్దస్త్ నూకరాజుతో కలిసి రాజీవ్ కనకాల చేసిన కామెడీ అదిరిపోయింది.

పెద్ద పెద్ద కమెడియన్లకు దీటుగా ఆయన కామెడీ పంచులను వేశారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో రాజీవ్ కనకాల వేసిన పంచులను, ఆయన చేసిన కామెడీని చూసేయండి. మొత్తం ఎపిసోడ్ కావాలంటే ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూడాల్సిందే.

 


Share

Related posts

Rashmika Mandanna Amazing Clicks

Gallery Desk

ఒకేరోజు రెండు చిత్రాల‌తో ..

Siva Prasad

విశాఖలో మెట్రోరైల్… వ‌చ్చే నెలలోనే గుడ్ న్యూస్‌

sridhar