ఈ స్టార్ డైరెక్టర్ కోసం స్టార్ హీరోలు క్యూలో ఉన్నారంటున్నారే గాని పాపం అయోమయంలో ఉన్నాడంటున్నారు ..?

ఎస్ ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘రౌద్రం రణం రుథిరం’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2021 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెల 22 న కొమరం భీమ్ టీజర్ రానుంది.

NTR 30 Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News, Photos  & Videos | Moviekoop

ఇక ఎన్.టి.ఆర్ తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయినను పోయిరావలె హస్తినకు అన్న టైటిల్ కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే రూపొందిస్తున్నారు. హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

ఇప్పటికే ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోయో ప్రాజెక్ట్ మీద కొత్త రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా కరోనా కారణంగా 7 నెలలు షూటింగ్ నిలిచిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా షూటింగ్ మొదలైన ఈ సినిమా 2021 సమ్మర్ వరకు రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు కాబట్టి అప్పటి వరకు ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తోనే బిజీగా ఉంటాడని తెలుస్తుంది. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్ తో కాకుండా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఇదే గనక నిజమీతే త్రివిక్రమ్ 2022 వరకు ఎన్టీఆర్ కోసం వేయిట్ చేయాల్సిందే. త్రివిక్రమ్ కోసం స్టార్స్ అందరూ క్యూలో ఉన్నారని వార్తలు వస్తున్నప్పటికి ప్రస్తుతం ఆయన పరిస్థితి అయోమయంలో ఉందన్న మాట వినిపిస్తోంది.