NewsOrbit
జాతీయం న్యూస్

Pegasus: ‘పెగాసస్’ పై సుప్రీం కీలక ఆదేశాలు..!!

Pegasus: దేశ వ్యాపితంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని చెప్పింది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం..పెగాసస్ పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలన జరిపి కోర్టుకు నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలన చేస్తుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

supreme court key verdict on pegasus
supreme court key verdict on pegasus

Pegasus: పార్లమెంట్ లో పెగాసస్ ప్రకంపనలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పెగాసస్ తో లక్ష్యంగా చేసుకున్న వారిలో 300 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఇందులో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికే),  తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్ర మంత్రలు, జర్నలిస్ట్ లు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో విపక్షాలు పార్లమెంట్ లోనూ, బయట ఆందోళన చేశాయి. పెగాసస్ ప్రకంపనల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగలేదు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పార్లమెంట్ లో నిరసనలు వ్యక్తం చేశారు.

‘పెగాసస్’ పై విచారణకు నిపుణుల కమిటీ

దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలంటూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల విచారణ జరిపిన సుప్రీం కోర్టు పలు మార్లు కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. అయితే దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్ దాఖలు చేయడం లేదని సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఇంతకు ముందు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దేశ పౌరుల పై వివక్షాపూరితమైన నిఘాకు తాము ఎన్నటికీ అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju