ఢిల్లీ, జనవరి 30: ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టం సవరణలపై స్టే జారీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో జోడిస్తూ ఇటీవల తీసుకువచ్చిన సవరణలపై స్టే ఇవ్వాలన్న అప్పీల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఎస్సి, ఎస్టి చట్టంలోని కొన్ని నిబంధనలను సడలిస్తూ సుప్రీం కోర్టు గత సంవత్సరం వెలువరించిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌తో పాటు అన్ని అంశాలపై ఫిబ్రవరి 19న విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు.
గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన పార్లమెంట్ ఎస్సి, ఎస్టి వేధింపుల నిరోధక సవరణ బిల్లు ఆమోదించింది.