వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని తమిళ పార్టీలు తమ తమ కసరత్తులు మొదలు పెట్టాయి. ఇక ఇప్పుడు వరకు అగమ్యగోచరంగా ఉన్నసినీ తారల రాజకీయ ఎంట్రీకి సంబంధించిన విషయాలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. విశ్వనటుడు కమల్ హాసన్ తన పార్టీని ప్రకటించి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ సైతం తన రాజకీయ ఎంట్రీకి సంబంధించిన కసరత్తలు మొదలు పెట్టారు.
గతంలోనే రజనీ తాను రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. కానీ ఆయన సరిగ్గా ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అన్న విషయంపై క్లారిటీ లేదు. దాని ఫలితంగా అటు రజిని అభిమానుల్లోనూ, ఇటు తమిళ రాజకీయాల్లోనూ సస్పెన్స్ చోటుచేసుకుంది. తాజా సమాచారంతో రజనీ ఇక ఈ ఉత్కంఠకి తెరదించాలని నిర్ణయించుకున్నారని అర్ధమవుతుంది. ఈ రోజు చెన్నైలో ఉదయం తొమ్మిది గంటలకు అభిమాన సంఘాలకు చెందిన అధ్యక్షులతో రజిని మీటింగ్ నిర్వహించనున్నారు. తరువాత తన రాజకీయ ఎంట్రీపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.