Tamannah : తమన్నాకి .. టాలీవుడ్ లో చాలా సీనియర్ హీరోయిన్. శ్రీ అన్న సినిమాతో టాలీవుడ్ లో పరిచయం అయింది తమన్న. మిల్కీ బ్యూటీగా అందరిని బాగా ఆకట్టుకుంది. డెబ్యూ సినిమా ఫ్లాపయినా కూడా ఆ తర్వాత హ్యాపీ డేస్ అన్న సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత తమన్నా ఇప్పటి వరకు ఎనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తెలుగు, తమిళ సినిమాలలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసింది. ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది.
దాదాపు 16 ఏళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమన్నా నటించిన సినిమాలలో దాదాపు అన్నీ సూపర్ హిట్స్ సినిమాలే ఉండటం విశేషం. యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు దాదాపు అందరి హీరోలతో నటించింది. తమన్నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది రెండు మూడేళ్ళకే కనుమరుగైపోయారు. కానీ తమన్నా ఇప్పటికే అదే క్రేజ్ తో లీడ్ చేస్తోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఆరేడు సినిమాలున్నాయి. ఇవన్నీ కూడా క్రేజీ సినిమాలే.
Tamannah : తమన్నాకి ఇంకా మంచి సినిమాలు చేయాలన్న కోరిక ఉందట.
ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న సీటిమార్ అన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. సంపత్ నంది ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ సరసన అంధాధున్ తెలుగు రీమేక్ చేస్తోంది. వెంకటేష్ తో చేస్తున్న ఎఫ్ 3 షూటింగ్ దశలో ఉంది. అలాగే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు నాగార్జున సినిమా.. కేజీఎఫ్ హీరో యశ్ లేటెస్ట్ సినిమా..సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాలను చేస్తోంది. ఈ సినిమాలలో దాదాపు మూడు నాలుగు సినిమాలు ఈ ఏడాదే వచ్చేస్తాయి. ఇలా వరసగా సినిమాలు చేస్తూ 16 ఏళ్ళ నుంచి కెరీర్ ని కొనసాగిస్తున్న తమన్నాకి ఇంకా మంచి సినిమాలు చేయాలన్న కోరిక ఉందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!