ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు అన్న కారణంతో తమిళ టాప్ హీరో శామ్ ను తమిళనాడు పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసారు. శామ్ తమిళంలో కాక తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.
కిక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శామ్ ఆ తర్వాత రేసుగుర్రం సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఇంట్లోనే జూదం తదితరమైనవి ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నుంగంబాక్కమ్ లో ఉంటున్న అతడి ఇంటిని పోలీసులు రైడ్ చేయగా 14 మందితో కలిసి అతడు జూదంతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలిసింది. శామ్ తో పాటు అరెస్టైన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తలు, సినిమా వాళ్ళు, హోటల్ ఓనర్లు కూడా ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!