Child: మీ పిల్లల  జీవితం లో రియల్ హీరో లు గా ఉండాలంటే ఇది బాగా నేర్పించండి !!

Share

Child: పిల్లల్లో మానసిక ఎదుగుదల బాగుండాలి అంటే  వారిలో   ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం నింపాలి. పిల్లల మానసిక ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ  తీసుకోవాలి. మేము దేనిని అయిన   సాధించుకురాగల సమర్థులం అని పిల్లలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగేలా కన్నవారే పిల్లలను తీర్చి దిద్దాలి.   పిల్లలకు పాజిటివ్ మాటలు చెప్పి వారికి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలి . ఈ పాజిటివ్  మాటలనే    పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు.  పిల్లల మానసిక వికాసం పెంపొందించేందుకు   మరిన్ని విషయాలు  తెలుసుకుందాం.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహిస్తూ ఉండాలి. వారి ఎదుగుదలకు సంబంధించిన ప్రతి విషయంలో సపోర్ట్ ఇవ్వాలి. అలాగే పిల్లలకు గారాబం కాకుండా ప్రేమను  పంచి ఇవ్వాలి.  అలాగే పిల్లలకు ఎలాంటి లోపాలు ఉన్న  తమను   తాము ప్రేమించుకునే విధంగా  తీర్చి దిద్దాలి. దీనినే సెల్ఫ్-లవ్ అని పిలుస్తారు. ఈ లక్షణం కలిగి ఉన్నవారు భవిష్యత్తులో పరాజయాలకు కుంగిపోకుండా,మరల,మరల గెలవడానికి తమ లక్ష్యం వైపు  అడుగులు వేస్తారు.

పిల్లల ప్రవర్తన  ఎప్పుడు  వారు పెరిగే వాతావరణం మీద ఆధార పడి ఉంటుంది. మంచి కుటుంబ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఎప్పుడు మంచి ప్రవర్తన  తోనే ఉంటారు.ఎందుకంటే  చిన్నతనంలో ఎదురయ్యే అనుభవాల ను బట్టి  వారి ప్రవర్తన  ఉంటుంది. కాబట్టి వారికి  ఎప్పుడు  మంచి మాటలు చెప్పడం.. మీరు కూడా మంచి పనులు చేయడం ద్వారా  వారు మంచి మార్గంలో వెళ్లేలా చేయవచ్చు.
బయట ప్రపంచంలో  జరిగే  సంఘటనలు  వల్ల కూడా పిల్లలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.  ఇంటి దగ్గర  తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది చెడు,ఏది మంచి అనేది తెలుసుకోగలిగే సంస్కారం మంచి మాటలు  చెబుతూ నింపాలి  నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు అని బయట వ్యక్తులు ఎవరైనా  మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని  దెబ్బ తినే విధం గా చేయవచ్చు. అటువంటి సందర్భాల్లో పాజిటివ్ అఫర్మేషన్స్ బాగా  పనిచేస్తుంది.జీవితం మీద  సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్న పిల్లలు చాలా ఆనందం గా  ఉంటారు. అంతా మంచే జరుగుతుంది అన్న నమ్మకం తో వారు ఒత్తిడిని చాలా తేలికగా జై యిస్తారు. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ లేదా సానుకూల దృక్పథం,పిల్లల ఆత్మగౌరవాన్ని  పెంచుతుంది. ఇవి మానసిక ఎదుగుదలకు  బాగా ఉపయోగపడతాయి. అలాగే, నెగిటివ్ ఆలోచనలను  రానివ్వకుండా అడ్డుకుంటాయి.

ప్రస్తుతం ఉన్న  డిజిటల్ ప్రపంచంలో పిల్లలపై ఎక్కువ  చెడు ప్రభావం పడే  అవకాశాలు చాలా ఎక్కువ  అందుకే, పిల్లల్లో  ఎప్పుడు  పాజిటివిటీ ని  నింపాలి.  అలా చేయడం వలన  పిల్లల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే  శక్తి పెరుగుతుంది.చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏమిటంటే, పిల్లలను చిన్నప్పటి నుండే మంచి మార్గం లో పెట్టకుండా చిన్నపుడు ఏమి చేస్తున్న చూసి  ఆనందిస్తుంటారు . ఎమన్నా అంటే చిన్న పిల్లలకు ఏమి తెలుస్తుంది పెద్దయ్యాక నేర్చుకుంటారు అని సమర్ధిస్తూంటారు. కానీ అది చాలా పొరపాటు.. చిన్నప్పుడు నేర్పితేనే వారికి మంచి, చెడు తెలుస్తోంది. పెద్దయ్యాక వారు నేర్చుకోవడానికి ఏమి ఉండదు.


Share

Related posts

జగన్ ఆదేశిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఏపీ రాజకీయాల్లో రాణిస్తా అంటున్న పక్క రాష్ట్ర మంత్రి..!!

sekhar

‘కమిషన్‌లు, కమిటీలతోనే వారి పాలన’

somaraju sharma

ఈ సారి లోకేశ్ బాబు చెప్పింది వింటే .. జగన్ కూడా నిజమే కదా అంటాడు ?

sekhar