తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .. టాపర్లు వీళ్లే

Share

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలైయ్యాయి., జేఎన్టీయు ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాట్లాడుతూ .. ఇంజనీరింగ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్ లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామనీ, కళాశాలల వివరాలు, కోర్సుల వివరాలు కౌన్సిలింగ్ సెంటర్ లో వెల్లడిస్తామని చెప్పారు.జూలై 18 నుండి 21వరకూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మ ఎంసెట్ పరీక్షలు నిర్వహించగా, ఇంజనీరింగ్ పరీక్షలకు 1,56,812 మంది, ఫార్మా కోర్సుల పరీక్షలకు 80,575 మంది హజరైయ్యారు.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

టాపర్లు వీరే

ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఖానామెట్ కు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి ప్రధమ ర్యాంక్ సాధించారు. శ్రీకాకుళం జిల్లా రేగడి అమదాలవలసకు చెందిన నక్కా సాయి దీప్తి రెండో ర్యాంక్, తెనాలికి చెందిన పోలిశెట్టి కార్తికేయ మూడో ర్యాంక్, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలికి చెందిన పల్లి జలజాక్షి నాల్గవ ర్యాంక్, శ్రీకాకుళం జిల్లా బలగ గ్రామానికి చెందిన మెండ హిమవంశీ అయిదవ ర్యాంక్ సాధించారు.

అగ్రికల్చర్ విభాగంలో తెనాలికి చెందిన జూటూరి నేహ మొదటి ర్యాంక్ వచ్చింది. విశాఖ జిల్లా కోటపాడుకు చెందిన పంటకు రోహిత్ రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా కోమెరపూడికి చెందిన కల్లం తరుణ్ కుమార్ రెడ్డి మూడో ర్యాంక్, కూకట్ పల్లికి చెందిన కొత్తపల్లి మహి అంజన్ నాల్గవ ర్యాంక్, గుంటూరుకు చెందిన గుంటుపల్లి శ్రీరామ్ అయిదవ ర్యాంక్ సాధించారు.

కేసిఆర్ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం .. ఇవి కేబినెట్ నిర్ణయాలు


Share

Related posts

Huzurabad Congress: హుజూరాబాద్ కాంగ్రెస్‌లో కుదుపు..! ఆడియో టేప్ వైరల్..! కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు..!!

somaraju sharma

నాగ చైతన్య లైఫ్ లోనే లవ్ స్టోరీ లాంటి సినిమా చేయలేదా..?

GRK

YSRCP: విజయసాయికి కీలక బాధ్యతల వెనుక అసలు రాజకీయం ఇదేనా..?

somaraju sharma