NewsOrbit
Featured న్యూస్

బ్రేకింగ్: నాయిని ఇక లేరు..!!

 

తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్శింహరెడ్డి బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత తుది శ్వాస విడిచారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో నాయినిని పరామర్శించారు. తొలుత కరోనా నుండి కోలుకున్న నాయిని మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేర్పించగా అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందించారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

నిన్న సాయంత్రం ఆసుపత్రికి చేరుకున్న సీఎం కేసిఆర్ నాయిని అరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నాయినితో ఉన్న అనుబంధంతో భావోద్వేగానికి గురైన కేసిఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాయిని భార్య అహల్య, కుమారుడు, అల్లుడు కూడా కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నారు.

1944లో నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామంలో జన్మించిన నాయిని నర్శింహరెడ్డి కార్మిక నాయకుడుగా పేరు సంపాదించారు. 1947లో హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) రాష్ట్ర శాఖ స్థాపించిన నాయిని చివరి వరకూ కార్మిక సంక్షేమానికి సేవలు అందించారు. 1969 నాటి తొలి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల భూమికను పోషించారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీ నేతగా ఉద్యమించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి తుది శ్వాస విడిచే వరకూ ఆ పార్టీలోనే కొనసాగారు. 1978,1985,2004లో ముషీరాబాద్ నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్‌తో కలిసి పని చేయడంతో టీఆర్ఎస్ తొలి సారి అధికారంలోకి రాగానే నాయినికి కేసిఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన హోంశాఖను అప్పగించారు కెసిఆర్. నాయినికి భార్య, ఒక కుమార్తె సమతా రెడ్డి, కుమారుడు రవీందర్ రెడ్డి ఉన్నారు.

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju