NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఆంధ్ర పోలీస్ లు వెనుకబడ్డారు : మంచి పోలీస్ స్టేషన్లే లేవట

 

ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు స్కౌచ్ పురస్కారాలతో ఆనంద పడుతూ ఉంటె తెలంగాణ పోలీసులు కేంద్ర హోమ్ శాఖా నిర్వహించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ ల పోటీల్లో దూసుకువెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 108 స్కౌచ్ పురస్కారాలను ఏపీ పోలీసులు అందుకున్న…. పొలిసు స్టేషన్ల నిర్వహణ విషయంలో వెనుకపడ్డారు. కేంద్రంప్రకటించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో ఏపీ కి ఎలాంటి పురస్కారం రాలేదు. తెలంగాణ లోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ మాత్రం టాప్ 10 సగర్వంగా నిలబడింది.

telangana-police-station-got-award
telangana-police-station-got-award

తెలంగాణలోని జమ్మికుంట టౌన్ పోలీసు స్టేషన్‌కు గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీసు స్టేషన్ల జాబితాలో జమ్మికుంట పోలీస్ స్టేషన్ నిలిచింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన దేశంలోని ఉత్తమ పోలీస్​స్టేషన్ల జాబితాలో జమ్మికుంట పోలీసు స్టేషన్ 10వ స్థానం దక్కించుకుని తెలంగాణ పోలీస్ సత్తా నిరూపించింది. గతేడాది తెలంగాణలోని చొప్పదండి పోలీసు స్టేషన్‌ జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిస్తే… ఈ సారి జమ్మికుంట టాప్ 10 నిలబడింది. పోలీస్ స్టేషన్ల సమర్థవంతమైన పనితీరును ప్రోత్సహించడానికి, ఆరోగ్యకరమైన పోటీని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఉత్తమమైన పనితీరు కనబరిచే పోలీసు స్టేషన్లను ఎంపిక చేస్తోంది. 2020 సంవత్త్సరానికి మంచి ప్రతిభ, అత్యుత్తమ పనితీరు ఆధారంగా ఈ అవార్డులు అందజేస్తున్నారు. ఈ జాబితాను కేంద్రం తాజాగా విడుదల చేసింది.

telangana-police-station-got-award
telangana-police-station-got-award

ఆంధ్ర పోటీ పడినా!!

పోలీస్ స్టేషన్ల పని తీరు మీద కేంద్ర హోమ్ శాఖా నిర్వహించిన పోటీలో ఏపీ నుంచి మూడు స్టేషన్లను పోటీకి పంపారు. అయితే వీటికి టాప్ 10 చోటు దక్కలేదు . మొదటి ప్లేస్‌లో మణిపూర్ రాష్ట్రంలోని తౌబల్ జిల్లాలోని నాంగ్‌పోక్‌సెక్మై పోలీసు స్టేషన్ నిలిచింది. తమిళనాడులోని సాలెం సిటీ జిల్లాలోని AWPS- సురమంగళం పోలీస్ స్టేషన్ రెండో స్థానంలో, అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలోని ఖర్సాంగ్ పోలీస్ స్టేషన్‌లో మూడో స్థానంలో, ఛత్తీస్‌ఘర్ సూరజ్‌పూర్ జిల్లా జిల్మిలి పోలీసు స్టేషన్ నాలుగో స్థానంలో, గోవాలోని దక్షిణ గోవా జిల్లా సాంగుమ్ పోలీస్ స్టేషన్ ఐదో స్థానంలో, అండమాన్, నికోబార్ దీవులులోని ఉత్తర, మధ్య అండమాన్ జిల్లాలోని కలిఘాట్ పోలీస్ స్టేషన్ ఆరో స్థానంలో, సిక్కింలోని ఈస్ట్ జిల్లాలోని పాక్యాంగ్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా కాంత్ పోలీస్ స్టేషన్‌ ఎనిమిదో స్థానంలో, దాద్రా నగర్ హవేలిలోని ఖాన్వెల్ పోలీస్ స్టేషన్ తొమ్మిది స్థానంలో, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్ పదో స్థానంలో నిలిచాయి.

పలు అంశాల ఆధారంగా..

దేశంలో 16,671 పోలీస్ స్టేషన్లు ఉండగా వాటిలో ఉత్తమ పోలీస్​స్టేషన్ల ఎంపికను కేంద్ర హోంశాఖ చేపట్టింది. ఈ ఎంపికలో పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రాపర్టీ నేరాలు, మహిళలపై నేరాలు, బలహీన వర్గాలపై నేరాలు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు, మృతదేహాలు.. కేసులను పరిక్షరించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు స్టేషన్లకు ఈ జాబితాలో చోటు కల్పించారు. తొలుత 75 పోలీసు స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేశారు. అనంతరం మరో 19 అందులో నుంచి టాప్ టెన్ జాబితాను ఎంపిక చేశారు. పైనల్ ప్రక్రియలో 19 అంశాలను పరిశీలించారు. వీటిలో పోలీస్ స్టేషన్‌లో మౌలిక సదుపాలయాలతో పాటు, స్టేషన్​లోని స్టాఫ్ పనితీరుపై వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను కూడా పరిగణలోని తీసుకున్నారు. ఇక, ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సర్వేను పూర్తి చేయడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి సహకారాన్ని అందించాయని కేంద్రం తెలిపింది.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N