తేనెలో స్వచ్ఛతపై షాకింగ్ నిజాలు బయటకు..!

 

ప్రకృతిలో విరభూసిన పువ్వుల నుండి మకరందాన్ని తేనెటీగలు సేకరించి మనకు అందిస్తున్నాయి..! తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు..! ప్రతి రోజూ ఉదయాన్నే కొద్దిగా తేనె తీసుకునే అలవాటుందా..? అయితే ఆ తేనె స్వచ్ఛమైనది కాదని సీఎస్ఈ కి చెందిన పరిశోధకులు 13 కంపెనీల నుంచి తేనె శాంపిళ్లను సేకరించి న్యూక్లియర్‌ మ్యాగ్నెటిక్‌ రిసోనెన్స్‌ పరీక్షల కోసం జర్మనీలోని ల్యాబ్‌లకు పంపారు.. అందులో కేవలం మూడు కంపెనీలు మాత్రమే స్వచ్ఛమైన తేనెను విక్రయిస్తున్నాయని వెల్లడించాయి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ..

 

 

పర్యావరణ సంస్థ (సీఎస్ఈ) చీఫ్‌ సునీత నరైన్‌ జరిపిన పరీక్షల్లో 13 కంపెనీల్లో మూడు కంపెనీలు.. సఫోలా, మార్క్‌ఫెడ్‌ సోనా, సొసియేట్ మాత్రమే న్యాచురల్ ఉత్పత్తులు..! మిగతా 10 కంపెనీలు తేనెలో చక్కెర పాకాన్ని కలిపి.. స్వచ్ఛమైనదంటూ విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ పదమూడు కంపెనీలకు చెందిన శాంపిళ్లను మొదట గుజరాత్‌లోని డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ)కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఎనాలసిస్‌ అండ్‌ లర్నింగ్‌ ఇన్‌ లైవ్స్‌స్టాక్‌ అండ్‌ ఫుడ్‌ (సీఏఎల్‌ఎఫ్‌) సంస్థకు పంపి ప్రాథమిక పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో చిన్న ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా పాస్‌ అయ్యాయి. చిన్న బ్రాండ్లు మాత్రం చక్కెరను కలిపి తేనెను కల్తీ చేసినట్లు తేలింది. అయితే పూర్తిస్థాయిలో కల్తీని తేల్చే ఎన్‌ఎంఆర్‌ పరీక్షల కోసం జర్మనీలోని ల్యాబ్‌లకు పంపగా పది కంపెనీల కల్తీ దందా బయటపడింది. మిగతా కంపెనీలు తమ బ్రాండ్‌ల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలా చేశారని మండిపడుతున్నాయి. తాము సహజ పద్ధతుల్లో తేనెను సేకరిస్తామని.. చక్కెరనో ఇంకేదో కలిపి కల్తీ చేయడం జరగదని వివరణ ఇచ్చాయి.