Thalaivi : తలైవి ..క్వీన్ కంగన రనౌత్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. సినీరంగంలోనూ.. తమిళ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసి.. ముఖ్యమంత్రిగా ప్రజలలో ‘అమ్మ’గా పేరు, ప్రఖ్యాతులను సంపాదించుకున్న జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.తలైవి ట్రైలర్ అలాగే రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక తలైవి సినిమా తమిళం తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే తమిళ నాడులో ఎలక్షన్స్ ఉన్న కారణంగా ప్రమోషన్స్ కి బ్రేక్ వేశారు.
కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 23న రిలీజ్ అనుకున్నది తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. కాగా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది త్వరలో వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. పరిస్థితులను బట్టి ఒకేసారు మూడు భాషల్లో రిలీజ్ చేయాలా లేక రెండు భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తారా చూడాలి.
Thalaivi : తలైవి సినిమాకి సోలో డేట్ ఎప్పుడు దొరుకుతుందో.
రీసెంట్గా ముంబైలో షూటింగ్స్ తో పాటు సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. తెలుగు, తమిళంలో రిలీజైన అరణ్య సినిమా హిందీలో హాథి మేరే సాథీగా రిలీజ్ కావాల్సిందే. అలాగే అక్షయ్ కుమార్ నటించిన సూర్యవన్షి రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ చేశారు.
వీటితో పాటు మరికొన్ని బాలీవుడ్ సినిమాలని రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు ఆయా చిత్ర దర్శక నిర్మాతలు. ఇక పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అమ్మ బయోపిక్ తలైవి రిలీజ్ నిలిచిపోయింది. చూడాలి మరి మళ్ళీ తలైవి సినిమాకి సోలో డేట్ ఎప్పుడు దొరుకుతుందో.