Vakeel Saab : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఈరోజు ఉదయం ఆకస్మికంగా థియేటర్లలో సినిమా టికెట్ రేట్లు పై నియంత్రణ విధించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలకు మొదటి మూడు రోజులు అధిక టికెట్లు తో అమ్ముతారు.
అయితే వకీల్ సాబ్ చిత్రం ఈ రోజు విడుదల కానుండగా… ఏపీ ప్రభుత్వం థియేటర్లలో అధిక ధర కి టికెట్లు అమ్మరాదని జీవో ప్రకటించింది. అయితే దీనిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అలాగే థియేటర్ ఓనర్ లు సరసమైన ధరలకే టికెట్లు అమ్మాలని ఆదేశించింది.
ఇది వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ ఓనర్ల కి ఊరటనిచ్చే అంశం. కాబట్టి సోమవారం ఈ కేసుపై విచారణ జరిగే లోపు ఈ మూడు రోజులు కొద్దిగా అధిక రేట్లకు టికెట్లను అమ్ముతారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!