NewsOrbit
న్యూస్

రాజకీయ క్రాస్ రోడ్స్ లో కన్నా ! భవిష్యత్తుపై తీవ్ర మధన!!

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేని రాజకీయ నాయకుల భవిష్యత్తు అగమ్యగోచరం గానే ఉంటుంది.

Than in Political Crossroads  Intense brewing on the future
Than in Political Crossroads Intense brewing on the future

ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి ఇదే! ఆయన ట్రాక్ రికార్డు చూస్తే కాంగ్రెస్ లో పులి! అనేకమంది ముఖ్యమంత్రుల క్యాబినెట్లో ఉన్నారు. సామాజిక వర్గ పరంగా కాపు కులస్తుడు.వంగవీటి రంగా తర్వాత ఆ స్థాయిలో సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడంటారు. కాంగ్రెసులో ఉన్నంతకాలం ఆయన టైం బాగానే ఉంది. రాష్ట్ర విభజన తదుపరి ఏపీలో కాంగ్రెస్కు పుట్టగతులుండవని తేలిపోయిన నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కూడా ప్రత్యామ్నాయం వైపు చూశారు.

అయితే ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెదొక దారి అన్నట్టుగా కన్నాలక్ష్మీనారాయణ వైసిపి వైపు రాకుండా బీజేపీలోకి వెళ్లిపోయారు.అదే ఆయన చేసిన చారిత్రక రాజకీయ తప్పిదం అంటారు.బీజేపీలో పెద్దగా తనకు ప్రాధాన్యం లభించకపోయేసరికి ఆయన వైసీపీకి జై కొట్టడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నారు.ఇక రేపు వైసీపీలో చేరాలని ఫిక్స్ అయిన తరువాత అనూహ్యంగా అమిత్ షా నుంచి కన్నాకు ఫోన్ వచ్చింది. వైసీపీలోకి వెళ్లవద్దని.. నీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాం అని చెప్పి వైసీపీలోకి పోకుండా చేశారు. బీజేపీ అయితే జాతీయ పార్టీ పైగా అధికారంలో ఉందని ఆశపడి కన్నా ఆగిపోయాడు. దీంతో ఆయన హాస్పిటల్లో చేరినట్లు కలరిచ్చి వైసిపి వైసీపీలోకి వెళ్లకుండా ఆగిపోయారు .

చివరకు బిజెపి తరపున నర్సరావుపేట ఎంపిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.బిజెపి లోనే ఉండిపోయారు అయినా బిజెపి లోనే కొనసాగుతూ ఆ పార్టీకి తనకు చేతనైన సేవలు చేసినప్పటికీ బీజేపీ అధ్యక్ష పదవిని రెండేళ్ల తరువాత పాపం చంద్రబాబు మీద కోపంతో కన్నాకు తీసివేశారు.. కేంద్ర బీజేపీ నాయకత్వం ఇప్పుడు కన్నాను అస్సలు పట్టించుకోవడం లేదంట.. కనీసం కన్నాకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు అని.. ఆయన మనుషులకు కూడా నోటీసులు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇలా కన్నా పరిస్థితి ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అమిత్ షా చేశాడని ఆయన అనుచరవర్గం తెగ బాధపడుతోందట..

వైసీపీలోకి వెళ్లి ఉంటే బొత్స సత్యనారాయణ మాదిరి మంత్రి అయ్యేవాడినని.. ఇప్పుడు ఎటూ కాకుండా పోయానని కన్నా లక్ష్మీనారాయణ మథన పడుతున్నాడంట!ఇప్పుడేమో వైసీపీ ద్వారాలు తెరిచి లేవు.. బీజేపీలో సీను లేదు …టిడిపి పరిస్థితి అస్సలు బాగాలేదు ..జనసేన సోదిలో లేదు ..మరి కన్నా గారు ఏం చేస్తారు ఎలా రాజకీయాల్లో మనుగడ సాగిస్తారు అన్నది వేచిచూడాలి.

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N