The Railway Men 2023:ఓటిటి వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ కి కొదవే లేదు. మంచి కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు వెబ్ సిరీస్ చూడటానికి మక్కువ చూపిస్తున్నారు. కానీ, వెబ్ సిరీస్ ది రైల్వే మెన్ అండ్ స్టోరీ ఆఫ్ ది భోపాల్ 1984 విడుదల నిలిపివేయడానికి బాంబే హైకోర్టు , నిరాకరించింది. అది ఎందుకో, ఇప్పుడు కారణాలు తెలుసుకుందాం..
కొన్ని సంఘటనలు జరిగి చాలా సంవత్సరాలైనా ప్రజలు వాటిని మర్చిపోలేరు. కారణం అవి మిగిల్చే చేదు జ్ఞాపకాలు వాటిని తలుచుకున్నప్పుడు మన గుండె బరువెక్కగా మానదు. అలాంటి సంఘటనలలో భోపాల్ గ్యాస్ ఘటన ఒకటి. 1984 డిసెంబర్ 2 న, మధ్యప్రదేశ్ భోపాల్లోని యు సి ఐ ఎల్, పెస్టిసైడ్ ప్లాంట్ లో, మిథైల్ రసాయనం లీకై కొన్ని వేలమంది సుమారు 3,000 మంది మరణించారు. మరికొంత మంది అస్వస్థకు గురయ్యారు. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనంగా మారిందని చెప్పవచ్చు. గడిచి చాలా కాలమైనా కానీ మరణించిన వారి జీవితాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల బాధ ఇప్పటికీ వర్ణనాతీతం..

ఇప్పుడు ఈ ఘటన మీద వెబ్ సిరీస్ రూపొందించారు. ఎస్ రాజ్ ఫిలిం వాళ్ళు ది రైల్వే మెన్ అన్న పేరుతో తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్ మీద జనాలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికీ రెండు చిత్రాలు విడుదలయ్యి రికార్డులు సృష్టించాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ మీద కూడా అంతే అంచనాలు పెట్టుకున్నారు జనాలు. 1999లో భోపాల్ ఎక్స్ప్రెస్ అనే ఒక చిత్రం విడుదల చేశారు. ఆ తరువాత 2014లో బోపాల్ ఏ ప్రేయర్ ఫర్ రెయిన్ అనే పేరుతో మరో చిత్రాన్ని విడుదల చేశారు. ఈ రెండు చిత్రాలు ఈ సంఘటన ద్వారానే తెరకెక్కినవి. ఈ చిత్రాలు చూసినప్పుడు మన కళ్ళు చెమ్మగిళ్ళక మానవు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎస్ రాజు ఫిలిమ్స్ వాళ్ళు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. వీరి నిర్మించే తొలి వెబ్ సిరీస్ కూడా ఇదే. అందుకే దీనికోసం జనాలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 2014 తర్వాత ఇప్పటివరకు ఈ ఘటన మీద ఎలాంటి వెబ్ సిరీస్ కానీ సినిమా గాని రాలేదు. ఈ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రధారుదారులుగా మాధవన్, కేకే మెయిన్, దివ్య ఇందు, బాబిల్ ఖాన్, నటిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు రైల్వే సిబ్బంది నలుగురు ఇందులో ప్రధాన పాత్ర పోషించి వారిని కాపాడారు. ఇప్పుడు వారి మీదే ఈ వెబ్ సిరీస్ మొత్తం నడుస్తుంది.
ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూ సి ఐ కి చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులు, ఈ కేసులో నేరస్తులుగా ఉన్నవారు వీరిద్దరూ పెండింగ్ లో ఉన్న తమ శిక్షకు వ్యతిరేకంగా, ఈ వెబ్ సిరీస్ ద్వారా ఏమైనా జరుగుతుందని భావించి కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ విషాదానికి దారి తీసిన సంఘటనలు ఈ సిరీస్లో పొందుపరిచారని వాటి వల్ల తమకు పక్షపాతం కలిగిస్తుందేమోనని ఆందోళన చెందుతూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ వారు ఆ పిటిషన్ దాఖలు చేసినా అది కోర్టులో నిలవలేదు. వారి పిటిషన్ జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ గారు నేతృత్వంలో, వెకేషన్ బెంచ్ నవంబర్ 15వ తేదీన కొట్టివేసింది. ఈ సిరీస్ వాస్తవమైనది కాదని వారు మొదట కొన్ని సంఘటన నుంచి ప్రేరణ పొందాము అని తెలిపిన తరువాతే సిరీస్ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సంఘటన సంబంధించిన అన్ని విషయాలు, పబ్లిక్ డే మైండ్ లో అందరికీ తెలిసే విధంగా అందుబాటులో ఉన్నాయి. కావున ఈ పిటీషన్ను కొట్టివేస్తున్నట్టు బాంబే హైకోర్టు తెలిపింది. నవంబర్ 18 వ తేదీ నుండి ఈ వెబ్ సిరీస్ నెట్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.