Mamagaru November 18 2023 Episode 60: గంగాధర్ సరుకంతా అమ్ముడు పోయినందుకు చాలా సంతోషపడతాడు. కట్ చేస్తే ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆటలో చింటూ ఓడిపోతాడు. రేయ్ చింటూ నువ్వు ఓడిపోయావు మళ్లీ ఆడుతున్నావేంటి రా అని వాళ్ళ అక్క అంటుంది. లేదు నేను ఓడిపోలేదు అని చింటూ అంటాడు.నువ్వంత తొండ ఆడుతున్నావు రా నేను మీతో ఆడను అని వాళ్ళ అక్క అంటుంది. నువ్వు ఆడదామన్నా మేము ఇక్కడ ఉండటంలేదు కదా అక్క వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చింటూ అంటాడు. ఎక్కడికి రా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా పండగకి అని వాళ్ళ అక్క అంటుంది. లేదు వేరే ఇంటికి కిరాయి తీసుకొని వెళుతున్నాము అంట అమ్మ చెప్పింది అని చింటూ అంటాడు. గబగబా పరిగెత్తికెళ్ళి నాయనమ్మ చింటూ వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోతున్నారు అంట అని అంటుంది.

శ్రీలక్ష్మి పిల్లలతో వేరే ఇంటికి వెళ్తున్నాం అన్నా వంట ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది దేవమ్మ. ఇక్కడ ఉండి ప్రయోజనం ఏముంది అత్తయ్య ఒక ఎదగా పొదుగా లేని బ్రతుకులకి ఇక్కడ ఉండి ఏం సాధించాలి వేరే ఇంటికి వెళ్లిన ఆనందంగా ఉంటాము అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటి శ్రీలక్ష్మి అలా అంటావు అని దేవమ్మ అంటుంది. మరేంటి అత్తయ్య మామయ్య గారు ఉద్యోగాలకు వెళ్ళమని వరం ఇచ్చినా వసంత అక్క బావ గారు సంతకం పెట్టలేదు వసంతక్క సంతకం పెట్టుంటే ఈపాటికి హాయిగా ఉద్యోగం చేసుకుని ఆనందంగా ఉండే వాళ్ళం అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటి శ్రీ లక్ష్మక్క అలా అంటావు తప్పు మేము చేశామా అని వసంత అంటుంది. సంతకం పెడితే అయిపోయేది కదా వసంత అక్క అని శ్రీలక్ష్మి అంటుంది. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం మేమే మిమ్మల్ని చెడగొడుతున్నామని అంటున్నారా మీరు మాత్రం చేసిందేంటి పొదుపు సంఘం డబ్బులు మీరు పంచుకొని మాకు అన్యాయం చేయలేదా అయినా మీరెందుకు వెళ్లడం మేమే వెళ్తాము వసంత సామాన్లు సర్దు మనం వెళ్ళిపోదాం అని సుధాకర్ అంటాడు.

బావగారు పెద్దవారు మీరే ఇలా కోప్పడితే ఎలా చిన్న చిన్న వాటికి సర్దుకుపోవాలి కదా అని గంగ అంటుంది.ఇదంతా నీ వల్లనే కదా జరిగింది పైగా నువ్వే చెప్తున్నావా సర్దుకుపోవాలని అయినా మాకు కొంచెం అభిమానం ఉంది కదమ్మా అందుకే వెళ్ళిపోతున్నాం అని సుధాకర్ అంటాడు. కట్ చేస్తే, రేయ్ మహేష్ ఆ రోజు ఏం జరిగిందో సుధాకర్ అంతా నాకు చెప్పాడురా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. రేయ్ ఇప్పుడు ఆ విషయం నీ మనసులోనే ఉంచుకోరా బయట పెట్టకు పరువు పోతుంది అని మహేష్ అంటాడు. ఇంతలో గంగాధర్ వచ్చి ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నారు అని అడుగుతాడు. ఏమీ లేదురా కలిసి చాలా రోజులైంది కదా మాట్లాడుకుందామని ఫోన్ చేశాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. కలిసి మాట్లాడుకోవడానికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనాలారా నేను అసలే పనిలో ఉన్నాను అని గంగాధర్ అంటాడు. అంత పెద్ద పని ఏంటి రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఏమీ లేదురా మా నాన్నతో ఒక ఛాలెంజ్ చేశాను బిజినెస్ లో గెలుస్తానని చాలెంజి చేశాను ఒక్కరోజులో 50వేల సరుకoత్త అమ్మేశాను అని గంగాధర్ అంటాడు.

అయితే సాయంత్రం పార్టీ ఇవ్వాలి రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. సరేలేరా ఆలోచిద్దాం అని గంగాధర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,దేవమ్మ ఎందుకు అలా ఉన్నావు అని చoగయ్య అంటాడు.నేను భయపడదే జరుగుతుందండి పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అంటున్నారు అని దేవమ్మ అంటుంది. పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి నువ్వు నన్ను నిలదీయడానికి సంబంధం ఏంటి దేవమ్మ అని చoగయ్య అంటాడు. మీరు సక్రమంగా వాళ్ళని ఉద్యోగాలను చేసుకోనించి ఏ కట్టుబాట్లు పెట్టకపోతే పిల్లలు అలా ఎందుకు ప్రవర్తించే వాళ్ళండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు నేను మీ లెక్కల బుక్కు చూసుకుంటూ ఇంట్లో ఉందామా అని దేవమ్మ అంటుంది.

చూడు దేవమ్మ మా తాత ముత్తాత మా నాన్న ఈ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చారు నేను అలాగే నా కుటుంబం కలిసి ఉండాలని కట్టుబాట్లు పెట్టాను ఆస్తి ఇవ్వనని బెదిరించి వాళ్లను ఇక్కడే ఉంచాను వాళ్లు వెళ్లిపోవాలనుకుంటే నా తప్పు ఎలా అవుతుంది ముల్లును తీయడానికి ముళ్ళు ఉపయోగించి ముళ్ళు తీసి పారేసినట్టు ముల్లుని ముళ్ళు తోటే తీయాలి దేవమ్మ అందుకే వాళ్ళను కట్టుబాట్ల పేరుతో ఇంట్లోనే బంధించాను వాళ్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే నేను ఊరుకుంటానా నేను చూసుకుంటాను కదా అని చంగయ్య అంటాడు.

చూడండి ఏదైనా సమస్య రాకముందే దాన్ని పరిష్కరించుకోవాలి చేయి జారిపోయిన తరువాత ఎంత ప్రయత్నించినా మళ్లీ తిరిగి రాదండి ఆ తరువాత నీ ఇష్టం అని దేవమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, గంగ గుమ్మం దగ్గర నిలబడి గంగాధర్ కోసం ఎదురుచూస్తూ భగవంతుడ ఆయన సరుకాంత అమ్ముడుపోయేలా చేయండి అని ప్రార్థిస్తుంది. ఇంతలో గంగాధర్ ఇంటికి వస్తాడు. ఏమండీ సరుకంతా అమ్ముడుపోయిందా పోనీ సగమైన అమ్మేశారా ఏమి మాట్లాడరేంటండి మీ మొహం చూస్తుంటే నాకు భయం వేస్తుంది చెప్పండి అని గంగ కంగారుపడుతూ పడుతుంది. చూడు గంగ సరుకు సగం అమ్ముడుపోలేదు మొత్తం అమ్ముడుపోయింది అని గంగాధర్ సంతోషంతో చెప్తాడు.

అవునా అని గంగా సంతోషంతో సుధాకర్ ని గట్టిగా వాటేసుకుంటుంది. ఏమండీ ఈ విషయం అత్తయ్యకి మామయ్యకి చెప్పుదాం పదండి అని గంగ అంటుంది. కట్ చేస్తే గంగా ఇంట్లో వాళ్ళందరిని పిలిచి మామయ్య గారు మీ అబ్బాయి గెలిచారు అని అంటుంది. ఏరా గంగాధరం ఈ వయసులో రేసు ఆడి గెలిచావా అని చoగయ్య అంటాడు. అది కాదు మామయ్య మీ అబ్బాయి మీరు సరుకంతా అమ్మాలని పెట్టిన చాలెంజ్లో గెలిచాడు అని గంగ అంటుంది. ఏరా పుత్ర నిజమా సరుకాంత అమ్మేశావా లేదంటే ఉద్దరలు పెట్టావా అని చoగయ్య అంటాడు.లేదు నాన్న మొత్తం నెట్టు క్యాష్ అని గంగాధర్ అంటాడు..