Kumkuma Puvvu November 18 2023 Episode 2030: కావేరి దంపతులు హాల్లో కూర్చున్న వారిని చూసిన ఆశ ఏడుస్తున్నట్టు నటిస్తూ పైన బంటి రూమ్ వైపు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ నటిస్తూ ఉంటుంది. అది చూసినా కావేరి చూశారా చూశారా అండి మనం బంటి గాడు మీద ఆశకి ఎంత ఉందో చూశారా ఊరికే బంటి రూమ్ వైపే చూస్తుంది అని ఇదిగో ఆశ నేను ఒక సామెత చెప్తా విను అంటూ చిమడకే చిమడకే ఓ చింతకాయ నువ్వు ఎంత చిమ్మిడిన నీ పులుపు పోదు అన్నట్టు మా బండి గాడు బాగుపడేది ఎప్పటికో నీ మెడలో తాళి కట్టేది ఎప్పటికో నువ్వు నా కోడలు పోయేది పెట్టుకో అన్నట్టు నువ్వు ఎంత చూసినా వాడు బాగుపడతాడో తెలియదు గాని మా మరదలు అమృత నా తమ్ముడు అరుణ్ కుమారు వీళ్లిద్దరూ కలిసి మా బంటి గాని బుర్ర సగం తినేస్తున్నారు అంటుంది

అప్పుడు ఆశ ఏంటి అత్తయ్య ఏం చేస్తున్నారు వాళ్ళు అని అడుగుతుంది కావేరి అబ్బ ఏం మాట అన్నావు ఆశ మ మళ్లీ ఒకసారి అత్తయ్య అను అంటుంది ఆశ అదేంట బంటి నా మెడలో తాళి కట్టకపోయినా నేను మిమ్మల్ని అత్తయ్య అనే పిలుస్తాను అత్తయ్య అంటుంది అందుకు కావేరి సంతోషపడి పొంగిపోయి కావేరి ఏమీ లేదా ఆశ నా తమ్ముడు నా మరదలు ఇద్దరు కలిసి బంటి గానీ కి గతం గుర్తు తెచ్చుకో అసలు పెళ్లి రోజు నువ్వు అలా కింద పడిపోవడానికి కారణం ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకో పెళ్లిరోజు ఎందుకు కింద పడిపోయావు ఎలా పడిపోయావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు ఆశ అవునా ఆంటీ వాళ్లు అంత పని చేశారా అసలు బంటి కండిషన్ ఏమాత్రం బాగోలేదు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నాకు తెలియడం లేదు ఆంటీ అంటుంది కావేరి భర్త అవునమ్మా ఆశ నేను ఒకటి అడుగుతాను దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్పు అంటాడు ఆశ అడగండి అడగండి మామయ్య నేను ఎంతైనా నీకు కాబోయే కోడల్ని కదా ఆర్డర్ వేయండి మామయ్య అంటుంది

కావేరి భర్త నా కొడుకు బంటి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు కానీ నువ్వు బంటి చుట్టూనే తిరుగుతున్నావు నీకు ఎందుకు మా బంటి మీద అంత ఇష్టం పెరిగింది నాకు కాస్త చెబుతావా అంటాడు ఆశ తాళి కట్టాక ఒకవేళ బంటి కి ఇదే పరిస్థితి ఎదురైతే నేను బంటిని వదిలేసి వెళ్ళిపోయి ఉండేదాన్ని చెప్పండి మామయ్య అదేదో ఇప్పుడు జరిగింది నా మెడలో బంటి తాళి కట్టిన కట్టకపోయినా నా భార్యగా నా బాధ్యత నేను వహిస్తాను బంటి నీ కంటికి రెప్పలా చూసుకుంటాను అంటుంది ఆశ కావేరి ఏమండీ నా భర్త గారు చూశారా మీరు మీ అనుమానపు క్వశ్చన్లు ఆపండి అంటుంది కావేరి ఆశ కావేరి దంపతులకు అనుమానం రాకుండా నటిస్తూ అత్తయ్య నేను బంటి కి వేడి వేడి పాలు కాచి తాగించాలి అలాగే టాబ్లెట్స్ కూడా వేయించాలి కాబట్టి నేను వెళ్తాను అని వాళ్ళ దగ్గరనుంచి ఆశ వెళ్లిపోతుంది బంటికి గతం గుర్తు రాకుండా చేయడానికి డాక్టర్ దగ్గర నుంచి తెచ్చిన మత్తు టాబ్లెట్స్ ని ఆశ పాలల్లో వేసి కరిగించి తీసుకువెళ్లి బంటికి ఇస్తుంది

బంటి నువ్వు ఎవరు అని అడుగుతాడు ఆశ నేను బంటి నీకు కాబోయే భార్యను అంటుంది ఇదిగో ఈ పాలు తాగి పడుకో చక్కగా అంటుంది బంటి సరేనంటూ పాలు తాగి ఇదేంటి నాకు తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది రెప్పలు మూసుకుపోతున్నట్టు అనిపిస్తుంది అని అంటాడు బంటి ఆశ ఆ మరేమీ లేదు బంటి టెన్షన్ వల్ల నీకు అలా అవుతుంది కళ్ళు మూసుకొని పడుకో అంత సెట్ అవుతుంది ఆశ ఆశ బంటిని పడుకోబెట్టి తాగేసి చక్కగా పడుకున్నావు నువ్వు ఇలా ఉంటే నాకు ఎలాంటి ప్రమాదము లేదు ఇక త్వరగా నీ చేత్తో తాళి కట్టించుకుని ఆ అంజలి మీద గెలుస్తా బి రెడీ అంజలి కాస్కో అని మనసులో అనుకుంటుంది ఆశ.అమృత అరుణ్ కుమార్ అంజలిని తీసుకుని ఇంటికి వస్తుంటారు అరుణ్ కుమార్ అమ్మ అంజలి చూశావు కదా ఎవరు ఏంటో ఆ సాగర్ ఆశతో చేతులు కలిపి నీ మీద కోపంతో నిన్ను జైలుకు పంపించాడు ఆశ నీ భర్త బంటిని దక్కించు కోవాలని చూస్తుంది అంటాడు అరుణ్ కుమార్ అమృత చూడమ్మా అంజలి ఎవరి జీవితాలు వారి అంజలి నువ్విక ఆ సాగర్ వాళ్ల గురించి మర్చిపో నువ్వు ఆ లక్ష్మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. శ్వేతను చూసుకోవడానికి వాళ్ళ నాన్న సాగర్ ఉన్నాడు కదా అంటుంది

అమృత ఇకనుంచి అయినా నీ జీవితం నువ్వు చూసుకో దృష్టునికి దూరంగా ఉండాలని అంటారు కాబట్టి నువ్వు ఆ ఫ్యామిలీని వదిలేయక తప్పదు అంజలి అంటుంది అమృత అందుకు అంజలి మనసులో ఆలోచిస్తూ సరిగ్గా కారు స్మశానం దగ్గరికి రాగానే కారు ఆపండి నాన్న అంటుంది అంజలి అరుణ్ కుమార్ అమృత ఎందుకమ్మా ఇక్కడ ఆపమన్నావ్ ఇక్కడ చుట్టుప్రక్కల ఎవరూ లేరు కదా అంటుంది అమృత అంజలి మరేం లేదమ్మా మీరు లక్ష్మీని స్మశానం లో పెట్టింది ఇక్కడే కదా అంటుంది అంజలి అరుణ్ కుమార్ అమృత అవును అయితే ఏంటి అంజలి ఇప్పుడు నువ్వు ఆ లక్ష్మీ సమాధి దగ్గరికి వెళతావా అని అంటారు అంజలి అవును నాన్న నేను లక్ష్మి సమాధి దగ్గరికి వెళ్లి వస్తాను

అంజలి స్మశానంలోకి వెళ్లి లక్ష్మీ సమాధి దగ్గర కూర్చుని లక్ష్మీ నీకు నేను ఇచ్చిన మాట తప్పుతున్నాను నన్ను క్షమించు నీ కూతురుకు శ్వేతకు తల్లి ప్రేమ అందిస్తానన్న మాట నిజమే అందించాను ఇన్ని రోజుల వరకు నీ కుటుంబం గురించి ఆలోచించాను. సాగర్ ని ఒక మంచి మనుషుల తీర్చిదిద్దాను శ్వేతను మంచిగా చూసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను నా అజ్ఞాతవాసాన్ని ముగించాల్సి వచ్చింది నా భర్త బంటి నన్ను గుర్తు పట్టలేని పరిస్థితి కాబట్టి నేను అతని దగ్గర ఉండి తనకి గతం గుర్తుకు వచ్చేలా చేయాలి అది నా బాధ్యత అందుకనే నేను మాట తప్పుతున్నాను నన్ను క్షమించు లక్ష్మి అంటూ అంజలి లక్ష్మి సమాధి దగ్గర ఏడుస్తూ లక్ష్మికి చెప్పి వెళ్ళిపోతుంది అంజలి లక్ష్మీ ఆత్మ లేచి అంజలిని చూస్తూ అలాగే ఉండిపోతుంది