NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanthi: బీజేపీ అధిష్టానంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు .. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందంటే..?

Share

Vijayasanthi: సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ ని కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో కారణాలను వివరించిన విజయశాంతి .. బీజేపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అర్ధం అయ్యిందని అన్నారు. వారంతా తెర ముందు విమర్శలు .. తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు.

vijayasanthi

తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తొలగించవద్దని తాము కోరామన్నారు. అయితే బండి సంజయ్ ను మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. కేసిఆర్ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్ ను మార్చేసిందని విమర్శలు గుప్పించారు. సీఎం కేసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే ఆ పార్టీలోకి వెళ్లానని, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా చర్యలు తీసుకోలేకపోయారని, దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తర్వాత తర్వాత అర్ధం అయ్యిందన్నారు.

ప్రధాన మంత్రి మోడీకి కేంద్రంలో భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే  పూర్తి మెజార్టీతో ఉండగా, కేసిఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తన రాష్ట్రమే తనకు ముఖ్యమని అనుకొని రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ వచ్చినప్పుడు విమర్శలు చేయడం, వదిలివేయడం ఇదో తంతుగా మారిందని అన్నారు. మధ్య లో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పిచ్చోళ్లని ఆమె అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన విజయశాంతి .. కేసిఆర్ అవినీతిని కక్కిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించే పార్టీతోనే తాను నడుస్తానని, రాష్ట్రంలో, కేంద్రంలో అధికార మార్పు జరుగుతుందని దీమా వ్యక్తం చేశారు విజయశాంతి.

Assembly Polls 2023: ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక నిర్ణయం ..నిషేదం ఏ రోజు నుండి ఎవరకు అంటే ..? 


Share

Related posts

కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రాన్ని సరికొత్త డిమాండ్ చేసిన మమతా బెనర్జీ..!!

sekhar

ఏపి ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన హైకోర్టు.. ఎందుకంటే..?

somaraju sharma

తను మరణించి.. 8 మందిని బతికించి..! మానవత్వానికి ఊపిరిచ్చిన పోలీస్..!!

Vissu